Anam Ramnararayana Reddy: మళ్ళీ జలహారతుల పునరుద్ధరణ
ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా.. ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.
- By manojveeranki Published Date - 01:26 PM, Mon - 12 August 24

ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) ఇటీవల కృష్ణా, (Krishna) గోదావరి (Godavari) పవిత్ర సంగమం వద్ద జరిగే జలహారతులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంలో, ఆయన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి (Durgamma Temple) అంతరాలయంలో వీడియోగ్రఫీ (Videography) చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ఆనం మాట్లాడుతూ, రూ.113 కోట్ల సిజి.ఎఫ్. నిధులతో 160 దేవాలయాల (Temples) ఆధునికీకరణ పనులను చేపడతామని వివరించారు. అలాగే, ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం అందించే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతున్నామన్నారు. రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై ఫిర్యాదులు (Complaints) స్వీకరించనున్నామని, ప్రజలు (People) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవాదాయ (Temple Lands) భూముల పరిరక్షణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో వేదపండితుల (Panthul) మంత్రోచ్చారణ మధ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రవేశించిన మంత్రి, పలు కీలక దస్త్రాలపై (Key Fiels) సంతకాలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం నారా చంద్రబాబు నాయుడు (Cm Chandra Babu Naidu) నేతృత్వంలో తమ ప్రభుత్వం సుపరిపాలనకు (Good Governance) ముందడుగు వేస్తోందని తెలిపారు.