HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Reservations For Them In Government Jobs Ap High Courts Key Orders

Transgenders Reservation : ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్లు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 15-11-2025 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap High Court
Ap High Court

ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక తీర్పు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్ల కోటా లేనందువలన.. స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం తనను పరిగణించలేదంటూ ఏలూరు జిల్లాకు చెందిన రేఖ అనే ట్రాన్స్‌జెండర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్లకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్లకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ చేపట్టిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశారు. అయితే మెగా డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ కల్పించలేదంటూ.. ఏలూరు జిల్లాకు చెందిన రేఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. డీఎస్సీలో ట్రాన్స్‌జెండర్ వర్గానికి పోస్టులు నోటిఫై చేయలేదని.. దీంతో అధికారులు తనను ఉద్యోగానికి ఎంపిక చేయలేదంటూ రేఖ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోస్టులు కేటాయించకపోవడమేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది. అనంతరం ఆరు నెలల్లోగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల కోటా అమలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే పిటిషనర్‌ను స్కూల్ అసిస్టెంట్‌గా నియమించే విషయాన్ని కూడా పరిగణించాలని స్పష్టం చేసింది. జస్టిస్ న్యాపతి విజయ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్నారని.. వారిని తిరిగి జనజీవనంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించడానికి ఒక సమగ్రమైన విధానం అవసరమన్నారు. కేంద్రం తెచ్చిన ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం-2019 అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

2019లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం తెచ్చింది. ఈచట్టం ప్రకారం కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లను అమలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా్న్ని హైకోర్టు ఆదేశించింది.

ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించడంతో పాటుగా ట్రాన్స్‌జెండర్లను జనజీవనంలోకి తీసుకువచ్చేందుకు రిజర్వేషన్లు అవసరమని హైకోర్టు పేర్కొంది. మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెనికి చెందిన ట్రాన్స్‌జెండర్( ఉమెన్) రేఖ.. మెగా డిఎస్‌సిలో 671వ ర్యాంక్ సాధించారు. అయితే ట్రాన్స్‌జెండర్ కోటా లేకపోవడం వలన ఆమెను స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రేఖ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP high court
  • government jobs
  • jobs
  • reservation
  • transgenders

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd