HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Religious Organizations Brought Under The Ambit Of The Rti Act

Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Religious Organizations Brought Under the Ambit of the RTI Act
Religious Organizations Brought Under the Ambit of the RTI Act

ఏపీలో దేవాలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం- 2005 పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల పరిపాలనా వివరాలు సమాచార చట్టం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్వహించేవి ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. ఈ చట్టం కింద ఎవరైనా సమాచారం అడిగితే ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని.. ఈ సంస్థలు ఆర్టీఐ చట్టానికి లోబడి అడిగిన సమాచారాన్ని అందజేయాలని వెల్లడించారు. ఆలయాల్లో అర్చకులు, చర్చిల్లో పాస్టర్లకు, మసీదుల్లో ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక దేవాదాయ శాఖ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారు. అందుకే ఈ సంస్థలు ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని కమిషన్ తేల్చి చెప్పింది. మత విశ్వాసాలు, వ్యక్తిగత ఆచారాలు, వేడుకల వంటి అంశాలకు సంబంధించిన విషయాలు ఆర్టీఐ పరిధిలోకి రావని క్లారిటీ ఇచ్చారు.

2013లో విశాఖపట్నం శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన సమాచారాన్ని పట్నాయక్ అనే వ్యక్తి కోరారు. అయితే తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వలేదని ఆలయ పీఐవోపై సీఐసీ (రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌)కు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్‌పై సీఐసీ విచారణ జరపగా.. మహాలక్ష్మి ఆలయం నుంచి డిప్యూటీ కమిషనర్, ఫిర్యాదు చేసిన పట్నాయక్ హాజరయ్యారు. ఇరువురు ఈ అంశంపై వాదనలు వినిపించారు. తాను ఆలయంలో పండుగలకు సంబంధించి సమాచారం కోరానని.. ఆర్టీఐ చట్ట ప్రకారం 21 దరఖాస్తులు చేసినట్లు పట్నాయక్ తెలిపారు. అయినా సరే పీఐవో నుంచి బదులు ఇవ్వకుండా దరఖాస్తుల్ని తిరస్కరించారన్నారు. తాను చేసిన దరఖాస్తుల్ని ఆర్టీఐ చట్టంలోని ఏ నిబంధన కింద తిరస్కరించారో చెప్పలేదని పట్నాయక్ తన వాదనల్ని వినిపించారు.

2018లో హైకోర్టు ఓ తీర్పు ఇచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఆలయాలు ఆర్టీఐ పరిధిలోకి రావని తీర్పు ఇచ్చింది కాబట్టి తాము సమాచారం ఇవ్వలేదన్నారు. హైకోర్టు మళ్లీ ఉత్తర్వులు ఇచ్చే వరకు సమాచారం ఇవ్వలేమన్నారు. అయితే ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని పరిశీలించి సీఐసీ పట్నాయక్ కోరిన సమాచారాన్ని 15 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం-2005 పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు వస్తాయని తేల్చి చెప్పారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Temples
  • Churches
  • Mosques
  • Rti Act 2005
  • Vajja Srinivasa Rao

Related News

Thalliki Vandanam

Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థ

  • Fight in the Middle of the Road Over a Girl

    Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

  • Another massive investment in AP.

    AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • AP Caste Census Report These Are the Castes with the Highest Population!

    AP Caste Census: ఏపీలో కులగణన రిపోర్ట్.. అత్యధిక జనాభా ఉన్న కులాలివే!

  • Chandrababu

    CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు

Latest News

  • Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?

  • Lenin: అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల..

  • Andhra Pradesh: ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి మతపరమైన సంస్థలు..

  • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

  • Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd