Posani : పోసానిపై కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దు : ఏపీ హైకోర్టు
ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
- Author : Latha Suma
Date : 06-03-2025 - 1:40 IST
Published By : Hashtagu Telugu Desk
Posani : నటుడు పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ చేసిన అసభ్యకరమైన కామెంట్స్‌తో పోసానిపై కేసులు నమోదు అయ్యాయి. విశాఖ, చిత్తూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆయన్ని విచారించేందుకు ఆయా స్టేషన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోసానిపై నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఆయా జిల్లాలో తనపై నమోదైన కేసులు కొట్టేయాలంటూ పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
Read Also: Sambhavna Vs Sana : బుర్ఖా ధరించమన్న సనా ఖాన్.. వీడియోపై దుమారం.. సంభావన రియాక్షన్
పోసాని కృష్ణ మురళి రెండు జిల్లాల్లో నమోదు అయిన కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన క్వాష్ పిటిషన్లు విచారించిన కోర్టు ప్రస్తుతానికి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణ మురళి పై 30 ఫిర్యాదుల ఆధారంగా.. 16 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదుల మేరకు పోసానిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 28న హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లిన అన్నమయ్య జిల్లా పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. కాగా, రాజంపేట జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిపై పీటీ వారెంట్లు జారీ అవ్వడంతో పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి గుంటూరు, అటు నుంచి కర్నూల్ సెంట్రల్ జైలుకు రిమాండ్ మీద పోలీసులు తరలించారు.
Read Also: TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్