AP : రాళ్లదాడి ఘటనలో జనసేనకు ఊరట…61మందికి బెయిల్..!!
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అధికారపార్టీ మంత్రులపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటనలో అరెస్టు అయిన వారికి కోర్టులో ఊరట లభించింది.
- Author : hashtagu
Date : 17-10-2022 - 8:51 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద అధికారపార్టీ మంత్రులపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడికి పాల్పడ్డ ఘటనలో అరెస్టు అయిన వారికి కోర్టులో ఊరట లభించింది. అరెస్టు అయిన 61మందిని పదివేల పూచీత్తుపై న్యాయస్థానం వారిని విడుదల చేసింది. మరో 9మందికి ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఆ 9మందిపై 307 సెక్షన్ను తొలగించి 326సెక్షన్ గా మార్చి రిమాండ్ కు పంపించారు. జనసేన నాయకులను పోలీసులు ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచారు.
కాగా వారిని కోర్టుకు తీసుకువచ్చే సమయంలో కోర్టులోని అన్ని గేట్ల దిగ్భందం చేశారు. అటు 92మంది జనసేన కార్యకర్తలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా జనసేన లీగల్ వెల్లడించింది. అరెస్టు అయిన వారిలో 9మంది పార్టీ నేతలకు రిమాండ్ విధించారని…మిగిలిని 61మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపింది.