HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Reliance Industries Biogas Plants In Ap

Reliance Bioenergy : ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు..ఆ జిల్లా రూపు రేఖలు మారినట్లే…!!

Reliance Industries Biogas : ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు

  • Author : Sudheer Date : 03-01-2025 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Reliance Industries Biogas
Reliance Industries Biogas

ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రం వైపు చూడని సంస్థలు..ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. మరోపక్క ఐటీ మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) సైతం తనదైన మార్క్ చూపిస్తూ సంస్థలను ఆకర్షిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి భారీ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల (Reliance Industries Biogas Plants) పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు. మొత్తం 4000 ఎకరాల బంజరు భూమిని లీజుకు ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!

కనిగిరి(Kanigiri)లో బయోగ్యాస్ ప్లాంట్ కోసం ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ. 15,000, ప్రైవేట్ భూమికి రూ. 30,000 చొప్పున లీజు కౌలు చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం ఇటీవల ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంతానికి ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి సాధించబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రభుత్వంతో కలసి రాష్ట్రవ్యాప్తంగా 500 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 65,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి. 8 జిల్లాల్లో చేపట్టబోయే ఈ ప్లాంట్ల నిర్మాణం ద్వారా సుమారు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…

పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో మూడు, రాజమండ్రిలో రెండు, కర్నూలు, నెల్లూరు, విజయవాడలో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశగా ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో బీడు భూములను వినియోగించి ప్రత్యేక గడ్డిని పెంచి, దానివల్ల బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని జనవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా చేయాలని యోచిస్తున్నారు. అయితే, కౌలు ఒప్పందాలు పూర్తి కాకపోతే ప్రారంభ వేడుక వాయిదా పడే అవకాశం ఉంది. రిలయన్స్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆ జిల్లా అభివృద్ధి రూపురేఖలు మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Kanigiri
  • nara lokesh
  • Prakasam District
  • Reliance Industries
  • Reliance Industries Biogas Plants

Related News

Nara Lokesh Blackbuck

Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'నైపుణ్యం' (Skill) పోర్టల్‌ను తీసుకువస్తోంది. ఇప్పటికే 25 కీలక రంగాలకు సంబంధించిన డేటా ఇంటిగ్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

  • New Airports Ap

    New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

  • Vaali Lokesh

    Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

Latest News

  • Ranveer Singh Threat Case : రూ.10 కోట్లు ఇవ్వాలంటూ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు

  • Gold Price Today 20 Feb 2026 : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర

  • తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

  • సుహాస్ హే బలవంత్ మూవీ రివ్యూ

Trending News

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd