AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కర్ణాటక పర్యటనకు వెళ్లారు.
- Author : Kode Mohan Sai
Date : 03-01-2025 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్నది. ఈ క్రమంలో ఉపసంఘం సభ్యులు కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా స్థానిక అధికారులతో సమావేశమయ్యారు.
కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం కోసం ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ గారి నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగింది. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. స్త్రీ, శిశు… pic.twitter.com/jnLxluwCEh
— Anitha Vangalapudi (@Anitha_TDP) January 3, 2025
ఈ సందర్భంగా, బెంగళూరులో ఏపీ మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, అనిత, సంధ్యారాణి కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిను కలిశారు. అక్కడ ఉచిత బస్సు ప్రయాణం పై ఆ రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను సమీక్షించారు.
కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ, మంత్రుల కమిటీ ప్రయాణ విధానాలు, సేవల అమలు, ఫలితాలు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంది.
ఏపీలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక యొక్క అనుభవాలను పరిశీలించి, తన రాష్ట్రంలో తగిన మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటోంది.
— Anitha Vangalapudi (@Anitha_TDP) January 3, 2025