Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను జగన్..ఏనుగులు, గుర్రాలతో తొక్కించేస్తాడు – వర్మ కామెంట్స్
జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో నీవు కేవలం ఒక బంటువు మాత్రమే పవన్ కల్యాణ్’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాజు దాకా అవసరం లేదు… ఏనుగులు, గుర్రాలతో నిన్ను ఆయన తొక్కించేస్తాడని
- By Sudheer Published Date - 12:15 PM, Mon - 2 October 23

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మరోసారి దర్శకుడు , వైసీపీ పార్టీకి కీలకంగా మారిన రామ్ గోపాల్ వర్మ (RGV) కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం జనసేన ధినేత పవన్ కళ్యాణ్ వారాహి 4 విడత యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆదివారం కృష్ణ జిల్లా అవనిగడ్డ లో వారాహి సభ ఏర్పాటు చేసి జగన్ ఫై నిప్పులు చెరిగారు.
వైసీపీ (YCP) పతనం మొదలైంది..రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే..ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ (Jagan) అంటున్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులు.. మీరు కౌరవులని అన్నారు జగన్ రూ.వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైంది. ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా? సమాఖ్య స్ఫూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా..! అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం.. మీరు కౌరవులు. సరైన వ్యక్తులను గెలిపించుకోకుంటే ఒక తరం నష్టపోతుంది. జగన్ ఓటమి ఖాయం.. టీడీపీ – జనసేన అధికారంలోకి రావడం ఖాయం” అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also : CID – Narayana : లోకేష్ తో కలిసి విచారణకు రండి.. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
ఈ వ్యాఖ్యలపై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో నీవు కేవలం ఒక బంటువు మాత్రమే పవన్ కల్యాణ్’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాజు దాకా అవసరం లేదు… ఏనుగులు, గుర్రాలతో నిన్ను ఆయన తొక్కించేస్తాడని ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా కామెంట్ చేశారు. అలాగే మంత్రి అంబటి రాంబాబు సైతం నిన్న జరిగిన వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అంటూ ఎద్దేవా చేసారు. వారాహి యాత్ర యువగళం= వరాహగళం… ‘అవనిగడ్డ’ ఫ్లాప్ అయిందని వరాహగళం నిరూపించింది అని వివరించారు. 1 ప్లస్ 1=2 అనేది గణితంలో వర్తిస్తుందని, కానీ రాజకీయాల్లో కొన్నిసార్లు 1 ప్లస్ 1=0 అవుతుందని ఎద్దేవా చేశారు.
https://x.com/AmbatiRambabu/status/1708477560663744594