CID – Narayana : లోకేష్ తో కలిసి విచారణకు రండి.. మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు
CID - Narayana : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు.
- Author : Pasha
Date : 02-10-2023 - 11:57 IST
Published By : Hashtagu Telugu Desk
CID – Narayana : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు సీఐడీ విభాగం నోటీసులు పంపించింది. ఈ కేసులో ఏ2 గా ఉన్న నారాయణకు సీఐడీ అధికారులు ఈ -మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. నారా లోకేష్‌తో కలిసి తమ ముందు విచారణకు హాజరు కావాలని సూచించారు. ప్రస్తుతం నారాయణ బెయిల్‌పై బయట ఉన్నారు. అయినప్పటికీ సీఐడీ నోటీసులు ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్న నారా లోకేశ్ కు కూడా సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్నాక.. తాను తప్పకుండా హాజరవుతానని, తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఇక ఇన్నర్ రింగురోడ్డు కేసులో చంద్రబాబును ఏ-01గా సీఐడీ చేర్చింది.