HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pulivendula Satish Reddy Replaces Sajjala Ramakrishna Reddy He Will Coordinate Ysrcp Leaders

Pulivendula Satish Reddy: సజ్జలకు షాక్.. పులివెందుల సతీశ్‌కు జగన్ కీలక బాధ్యతలు!

వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి(Pulivendula Satish Reddy), సజ్జలతో జగన్ సమావేశం అవుతారట.

  • Author : Pasha Date : 08-04-2025 - 1:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pulivendula Satish Reddy Sajjala Ramakrishna Reddy Ysrcp Leaders Tdp

Pulivendula Satish Reddy:  వైఎస్సార్ సీపీలో ఏదో జరుగుతోంది. ఆ పార్టీ కీలక నేత, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉన్నారు.  తాడేపల్లిలో జరిగే సమావేశాల్లో, జగన్ పాల్గొనే కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించడం లేదు. మరోవైపు వైఎస్ జగన్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా మరో నేతకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు జగన్ రెడీ అయ్యారట. వైఎస్ జగన్‌తో వైఎస్సార్ సీపీ నేతల సమన్వయ బాధ్యతలను  పులివెందుల సతీశ్ రెడ్డికి అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇతరత్రా పార్టీ బాధ్యతలను చూడటం కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది.

వచ్చే వారం కీలక భేటీ 

వచ్చే వారం తాడేపల్లిలో సతీశ్ రెడ్డి(Pulivendula Satish Reddy), సజ్జలతో జగన్ సమావేశం అవుతారట. వివిధ జిల్లాలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుల నియామకం ఇంకా పెండింగ్ దశలోనే ఉంది. వాటి భర్తీపై జగన్ ఫోకస్ పెట్టబోతున్నారు. పార్టీ ముఖ్య నేతల పదవుల్లోనూ మార్పులు చేయబోతున్నారు.  ఈ అంశాలపై సతీశ్ రెడ్డి, సజ్జలతో జగన్ డిస్కస్ చేస్తారని సమాచారం. ఇద్దరూ కలిసి ఆ అంశాలపై సమన్వయంతో పనిచేయాలని జగన్ దిశా నిర్దేశం చేస్తారట.

Also Read :Nuclear Submarine Base: చైనాకు చెక్.. ఏపీలో అణు జలాంతర్గామి స్థావరం

విజయసాయిరెడ్డి ఆరోపణలపై సమీక్ష.. 

వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నంత వరకు నంబర్ 2 స్థానంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. పార్టీని వీడే క్రమంలో సజ్జల, సుబ్బారెడ్డి కోటరీపై విజయసాయి చేసిన పరోక్ష ఆరోపణలపై జగన్ సమీక్ష నిర్వహించారట. వైఎస్సార్ సీపీని బలహీనపర్చేలా వ్యవహరించే నేతలను పక్కన పెడతామని ఆయన అల్టిమేటం ఇచ్చారట. ఈక్రమంలోనే  పులివెందుల సతీశ్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారట. పార్టీ వ్యవహారాలన్నీ ఇక పారదర్శకంగా సాగాలని జగన్ కోరుకుంటున్నారట.  మొత్తం మీద ఈ పరిణామంతో లబ్ధి పొందబోయేది సతీశ్ రెడ్డి. ఈయన 2024 సంవత్సరం మార్చి 1న వైఎస్సార్ సీపీలో చేరారు.  టీడీపీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. టీడీపీ నుంచి పులివెందుల అసెంబ్లీ టికెట్‌ను ఆశించి సతీశ్ భంగపడ్డారు. దీంతో వైఎస్సార్ సీపీలో చేరారు.

Also Read :Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన ప్రమాదం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pulivendula Satish Reddy
  • sajjala ramakrishna reddy
  • tdp
  • ysrcp
  • ysrcp leaders

Related News

Atchannaidu Vs Botsa Satyanarayana

బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Acham Naidu Vs Botsa Satyanarayana  ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు… ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd