HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Train Splits Into Two Falaknuma Express Narrowly Misses The Mark

Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన ప్రమాదం

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.

  • By Pasha Published Date - 11:19 AM, Tue - 8 April 25
  • daily-hunt
Falaknuma Express Train Coaches Separated Srikakulam 

Falaknuma Express:  ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు పెను ప్రమాదం  తప్పింది. ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి బెంగాల్‌లోని హౌరా వైపు వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా పలాస శివార్లకు చేరుకోగానే, రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతోందో వారికి అర్థం కాలేదు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read :Kia Car Engines: కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజిన్లు మాయం.. ఏమయ్యాయి ?

కారణం ఇదీ.. 

ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌‌(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది. ఇందువల్లే రైలు రెండు భాగాలుగా విడిపోయిందని రైల్వే సిబ్బంది గుర్తించారు.  వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, విడిపోయిన బోగీలను రైలుకు అమర్చారు. ఇవాళ ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనపై రైల్వే అధికారులు సీరియస్‌ అయ్యారు. ఎందుకిలా జరిగిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటనలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం ఉందా ? విద్రోహ చర్య ఉందా ? అనేది తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు.

Also Read :HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు.. భారీ శాలరీతో హెచ్‌సీఎల్‌ టెక్‌లో జాబ్

చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు మే 31 వరకు అందుబాటులో ఉంటాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి శుక్ర, ఆదివారాల్లో.. తిరుపతి నుంచి చర్లపల్లికి శనివారం, సోమవారం ఈ  ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. చర్లపల్లి నుంచి తిరుపతికి మొత్తం 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఏప్రిల్ 13, 18, 20, 25, 27 తేదీల్లో, మే 2, 4, 9, 11, 16,18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9: 35 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 10:10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.  ఏప్రిల్ 14, 19, 21, 26, 28 తేదీల్లో, మే 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7: 10 నిమిషాలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఊందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Falaknuma Express
  • South Central Railway
  • srikakulam
  • train accident
  • Train Coaches Separated
  • Train Split

Related News

Train

Prakasam: ప్రాణం కాపాడేందుకు రివర్స్‌ గేర్‌లో వెనక్కి వెళ్లిన ఎక్స్‌ప్రెస్ రైలు

Prakasam: ప్రకాశం జిల్లా రైల్వే ట్రాక్‌పై ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడి ప్రాణం కాపాడాలనే నిబద్ధతతో రైల్వే సిబ్బంది, లోకో పైలట్లు చూపిన మానవతా దృక్పథం ప్రశంసనీయమైనది. అయితే, చివరికి ఆ ప్రయత్నం విఫలమై ఆ ప్రయాణికుడు కన్నుమూయడం అందరినీ కలచివేసింది.

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd