PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్
- By Vamsi Chowdary Korata Published Date - 10:54 AM, Thu - 16 October 25

ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు చేరుకున్నారు. అక్కడినుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కి కర్నూలు చేరుకుంటారు. అక్కడ జీఎస్టీ సభలో ప్రసంగించిన తర్వాత కర్నూలు విమానాశ్రయం చేరుకుని సాయంత్రం 4.45కు దిల్లీ బయల్దేరి వెళ్తారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్నారు. ప్రధాని మోదీకి శ్రీశైలం ఆలయంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ స్వామివారిని తొలిసారి దర్శించుకున్నారు.
ప్రధాని మోదీ శ్రీశైలం చేరుకున్నారు..కర్నూలు ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఒకే హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లారు. కాసేపట్లో శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు.
ప్రధాని మోదీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ స్వాగతం
On behalf of my people of Andhra Pradesh, I warmly welcome our Hon’ble Prime Minister, Shri @narendramodi Ji, to our state. pic.twitter.com/uaYSKnXZ6R
— N Chandrababu Naidu (@ncbn) October 16, 2025
భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతరులు స్వాగతం పలికారు. మోదీ కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి శ్రీశైలం బయల్దేరి వెళ్లారు.
శ్రీశైల మహాక్షేత్రానికి ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ వస్తుండగా.. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు ప్రధానులుగా శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు.
కర్నూలులో జరిగే సభా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ మాట్లాడనున్నారు. మంత్రి టీజీ భరత్ స్వాగతోపన్యాసం చేస్తారు.
వాస్తవానికి ప్రధాని మోదీతో కర్నూలులో రోడ్‌షో నిర్వహించాలని ముందు నిర్ణయించారు. కానీ ఆ తర్వాత బహిరంగసభగా మార్పు చేశారు. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు సభా ప్రాంగణంలోనే టెంట్ల మధ్యలో నిర్మించిన రహదారిపై వాహనం పైనుంచి ప్రధాని ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్‌షోగా వేదిక వరకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. కర్నూలులో జరిగే సభ మధ్యాహ్నం 2.30 నుంచి 4.10 వరకు ఉంటుంది.
కర్నూలులో జరిగే సభా వేదికపూ.. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూర్చుంటారు. వీరతో పాటుగా రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్.. ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు.. ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉంటారు.
ఏపీ పర్యటనకు వచ్చే ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి’ అన్నారు ప్రధాని