HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pothina Mahesh Joins Ycp

Pothina Mahesh : వైసీపీ లోకి పోతిన మహేష్..? టెన్షన్ లో కూటమి..!!

విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు

  • Author : Sudheer Date : 08-04-2024 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pothana Ycp
Pothana Ycp

జనసేన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పోతిన మహేశ్ (Pothina Mahesh) రాజీనామా చేయడం..వైసీపీ లో చేరబోతున్నట్లు ప్రచారం మొదలుకావడంతో కూటమిలో కొత్త టెన్షన్ మొదలైంది. విజయవాడ వెస్ట్ నుండి జనసేన (Janasena) తరుపున పోటీ చేయాలనీ ఎప్పటి నుండి భావిస్తూ వస్తున్న పోతిన మహేష్ (Pothina Mahesh) కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీరని అన్యాయం చేసాడు. పదేళ్లు గా జనసేన తో నడుస్తూ…పవన్ కల్యాణే మా ప్రాణం అని..చెప్పుకుంటూ , పార్టీ కోసం కష్టపడుతూ వచ్చిన నేతలకు చివరకు పవన్ కళ్యాణ్ చేసింది జీరో. జగన్ ను ఓడించేందుకు బిజెపి, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం వరకు ఓకే కానీ కనీసం పార్టీ కోసం పనిచేస్తూ వచ్చిన కీలక నేతలకు కూడా టికెట్ ఇప్పించలేనప్పుడు పార్టీ నడపడం ఎందుకు…? అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తూ వస్తున్నారు.

ఇక టికెట్ రానప్పుడు ఇంకెందుకు పార్టీ కోసం పనిచేయడం ..ఇంకెంతకాలం ఇతర పార్టీల నేతలను గెలిపించుకుంటూ పోవడం అని చెప్పి వరుస పెట్టి నేతలు , పార్టీ శ్రేణులు బయటకు వస్తున్నారు. ఇప్పటీకే ఎంతోమంది పార్టీని వీడగా..మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు పోతిని మహేష్ సైతం పార్టీకి రాజీనామా చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం నమ్మి నట్టేట మునిగామని , ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని.. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాపు సామాజికవర్గాన్ని బలి చేస్తున్నారన్న పోతిన మహేష్.. కాపు యువతను మోసం చేయవద్దని సూచించారు. వీరమహిళల పదవీ కాలం పొడిగించిన జనసేన.. మిగతావారి పదవులు ఎందుకు పొడిగించలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఏవిధంగా సీట్ ఇస్తారని.. పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోతారా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పార్టీకి పది స్థానాలు కుక్క బిస్కెట్లలా పడేసిందని ఆరోపించారు. రాజధాని ప్రాంత పరిధిలో జనసేన పార్టీని చంపేశారని మహేష్ అన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామనీ.. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఇంకో ఇరవై ఏళ్ళు కొనసాగుతుందో లేదో తెలియని పరిస్థితి ఉందని పోతిన మహేష్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం.. పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు.

ప్రస్తుతం మహేష్ వైసీపీ వైపు అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తుంది. తనకు టికెట్ రాకపోవడం తో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అంత భావించారు. కానీ రాజీనామా తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో. వైసీపీలో ఆయన చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. ఆయనతో సంప్రదింపులు జరిపినట్లు వినికిడి. సీఎం జగన్ నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవాడలో అడుగుపెట్టిన తర్వాత.. ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే పోతిన మహేష్ రాజీనామాతో కూటమికి కొత్త టెన్షన్ మొదలైంది. విజయవాడలో బలమైన బీసీ నేతగా పోతిన మహేష్ ఉన్నారు.

2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకు.. 22 వేల 367 ఓట్లు పడ్డాయి. విజయవాడలో పశ్చిమలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. మైనారిటీలు కూడా భారీగా ఉన్నారు. బీసీల మద్దతుతో పాటు మైనారిటీలు మద్దతు సైతం మొదటి నుండి మహేష్ ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ రాజీనామా చేయడం తో ఆ ఓట్లు అవతలి పార్టీకి పడే ఛాన్స్ ఉందని కూటమి ఖంగారుపడుతుంది. మరి మహేష్ తో కూటమి నేతలు మాట్లాడతారా..? లేదా వదిలేస్తారా..? అనేది ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read Also : Samsung : శాంసంగ్ ఎమ్ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్‌.. అదుర్స్‌..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • Pawan Kalyan
  • pothina mahesh
  • Pothina Mahesh joins ycp

Related News

Janasena 13th Formation Day

Janasena Formation Day : ‘జనసేన’కు 13 ఏళ్లు.. సామాన్యుడి గొంతుక నుంచి డిప్యూటీ సీఎం వరకు.. ఒక చారిత్రక ప్రయాణం!

జనసేన ప్రయాణం పూల బాట కాదు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయం, రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వంటి సంఘటనలు పార్టీ మనుగడపై ప్రశ్నలు రేకెత్తించాయి. అయితే, ఓటమిని చూసి

  • Ustad Bhagat Singh Ccensor

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd