Posani Muralikrishna: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.
- By Latha Suma Published Date - 06:43 PM, Fri - 21 March 25

Posani Muralikrishna : సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ కేసులో పోసానికి బెయిల్ ముంజూరు చేసింది. ఈ మేరకు పోసాని బెయిల్ పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన గుంటూరు కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. బుధవారం నాడు పోసాని బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్టు ఈరోజు(శుక్రవారం) బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: Cabinet meeting : ఏప్రిల్ 3న ఏపీ క్యాబినెట్ భేటీ
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈనెల 23 వరకు రిమాండ్ విధించగా, విచారణలో భాగంగా సీఐడీ అధికారులు ఒకరోజు పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం మళ్లీ కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్‌పై రెండ్రోజుల క్రితం విచారణ జరగగా న్యాయస్థానం ఇవ్వాల్టికి వాయిదా వేసింది.
కాగా, పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడుసార్లు అరెస్ట్ అయ్యి, మూడుసార్లు బెయిల్ పొందారు. ఇక, రేపు (శనివారం) ఉదయం పోసాని విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
Read Also: BJP MLAs : 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలలు సస్పెన్షన్ వేటు