CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని
ఒకవేళ గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారని పోసాని చెప్పుకొచ్చారు
- By Sudheer Published Date - 05:22 PM, Mon - 22 April 24

పది రోజుల క్రితం ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఫై రాయి దాడి (Stone Attack) జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక మీరెంటే మీరు అంటూ వైసీపీ ..టీడీపీ నేతలు ఆరోపించుకున్నారు. ఈ దాడి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు నాల్గు రోజుల్లోనే నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా అందులో సతీష్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం కోర్ట్ అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ దాడి కావాలని చేసింది కాదని..ర్యాలీకి వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం తో ఆ కోపం తో దాడి చేసి ఉండవొచ్చని నిందితుడి తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పుడిప్పుడే ఈ దాడి విషయాన్నీ అంత మరచిపోతుండగా..మరోసారి దీని గురించి అంత మాట్లాడుకునేలా చేసాడు నటుడు పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali ). ఈ దాడి గురించి ఆయన మాట్లాడుతూ..ఒకవేళ గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్‌లోనే చనిపోయేవారని పోసాని చెప్పుకొచ్చారు. సీఎంనే చంపాలనుకున్నవారికి తామొక లెక్కా అని ప్రశ్నించారు. గతంలోనూ రామ్ గోపాల్ వర్మనూ చంపాలని చూశారని, కానీ చంద్రబాబు నో చెప్పారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా రాష్ట్రంలో మర్డర్లు జరగవని పోసాని కీలక ఆరోపణలు చేసారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు అగ్రం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Neha Hiremath Murder: నేహా హిరేమత్ పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు,.. 14 కత్తి పోట్లు