Early Elections : ‘ముందస్తు’పై ఎవరి ఈక్వేషన్ వాళ్లదే.!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు `ముందస్తు` గురించి ఏడాది నుంచి చెబుతున్నాడు. ఆ మేరకు పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయ్యాడు. సంక్రాంతి తరువాత అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలతో సమావేశం కాబోతున్నాడు.
- By CS Rao Published Date - 01:25 PM, Mon - 3 January 22

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు `ముందస్తు` గురించి ఏడాది నుంచి చెబుతున్నాడు. ఆ మేరకు పార్టీని సన్నద్ధం చేస్తున్నాడు. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడానికి రెడీ అయ్యాడు. సంక్రాంతి తరువాత అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలతో సమావేశం కాబోతున్నాడు. ఆ సమావేశంలో `ముందస్తు`పై మరింత స్పష్టతను చంద్రబాబు ఇస్తాడని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ సర్కార్ పూర్తి కాలం కొనసాగదని బాబు అంచనా. ఒక వేళ పూర్తి కాలం పాలన కొనసాగితే మరింత వ్యతిరేకత వస్తుందని వైసీపీ భావిస్తుందట. అందుకే, ముందస్తుకు వెళ్లే ఛాన్స్ ఉందని ప్రత్యర్థుల భావన.తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒకేసారి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కేసీఆర్ ప్రభుత్వం గడువు పూర్తి కానుంది. ఆ లోగా ఎన్నికలను నిర్వహించాలి. అంటే, దాదాపు అక్టోబర్ నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలి. ఏపీ ప్రభుత్వానికి 2024 మే నాటికి గడువు తీరుతుంది. ఆలోగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయాలి. అంటే , 2024 ఫిబ్రవరి లేదా జనవరిలో షెడ్యూల్ ను నిర్ణయించడానికి అవకాశం ఉంది. ఎన్నికల చట్టం ప్రకారం ఆరు నెలలు ముందుగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తే..వచ్చే డిసెంబర్ లోగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం లేకపోలేదు.
Also Read : ఢిల్లీ చట్రంలో జగన్.!
ఏపీ, తెలంగాణ సీఎంలు రాజకీయంగా ఏకతాటిపై వెళుతున్నారు. ఇద్దరి మధ్యా రాజకీయ సమన్వయం బలంగా ఉంది. అందుకే , రెండు రాష్ట్రాలకే ఒకేసారి ఎన్నికల పెడితే..వచ్చే లాభాలపై అంచనా వేస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ బలమై రాజకీయ ప్రత్యర్తిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉన్నాడు. 2018 ఎన్నికల తరహాలో కాంగ్రెస్ తో టీడీపీ జత కట్టే ఛాన్స్ ఉంది. ఈసారి సెటిలర్లను చంద్రబాబు పూర్తి స్థాయిలో అనుకూలంగా తిప్పుకునే పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ఓటమికి కారణం కేసీఆర్. ఆ కసిని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బాబు తీర్చుకోవడానికి సంసిద్ధం అవుతున్నాడు.షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే..రెండు రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పడానికి చంద్రబాబుకు అవకాశం ఉంది. అదే, ఒకేసారి ఎన్నికల వస్తే..ఏపీ వరకు ఆయన్ను పరిమితం చేయడానికి అవకాశం ఉంది. ఇదే ఎత్తుగడ కేసీఆర్ వేస్తున్నాడని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే, సహజ మిత్రునిగా ఉన్న జగన్ పై ముందస్తు ఒత్తిడి తెస్తున్నాడని టాక్. ఇద్దరూ ఒకేసారి ఎన్నికలకు వెళితే, సెటిలర్లు ఎక్కువగా ఏపీకి వెళతారు. తెలంగాణ వ్యాప్తంగా సెటిలర్ల ఓట్లు తగ్గిపోయే ఛాన్స్ ఉంది. ఫలితంగా టీఆర్ఎస్ లాభపడడానికి అవకాశం ఉంది. అలాగే, జగన్ సామాజిక వర్గానికి చెందిన సెటిలర్లు ఓటింగ్ కోసం ఏపీకి వెళితే వైసీపీకి కలిసొస్తుందని అంచనా. సామాజికవర్గాల వారీగా ఓట్ల సంఖ్యను అంచనా వేసుకుంటే..ఇతర ప్రాంతాల్లో ఉండే జగన్ సామాజికవర్గం ఎక్కువని భావిస్తున్నారు. ఇలా..కేసీఆర్, జగన్ ఈక్వేషన్స్ వేసుకుంటూ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారట.
Also Read : బాబు ‘ముందస్తు’ మాట
జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడే వరకు ప్రచారం జరిగింది. ఆ తరువాత జమిలి ఎన్నికలపై బీజేపీ స్లో అయింది. పలుమార్లు జమిలి ఎన్నికల గురించి ప్రధాని మోడీ ప్రస్తావించినప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడానికి పరిస్థితులు అనుకూలించలేదు. ఈ ఏడాది జరిగే యూపీ, పంజాబ్ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా కేంద్రం ముందుకు కదిలే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్రం `ముందస్తు`కు వెళ్లే ఆలోచన చేస్తే, సాధారణ ఎన్నికలతో పాటు ఇరు రాష్ట్రాల ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా…పలు కోణాల నుంచి వస్తోన్న సమాచారాన్ని అధ్యయనం చేసిన చంద్రబాబు `ముందస్తు` మాటను వినిపిస్తున్నాడు.అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలను త్రోసిబుచ్చుతోంది. చంద్రబాబు మాటలను లైట్ గా తీసుకోవాలని మంత్రి బొత్సా సత్యనారాయణ అంటున్నాడు. క్యాడర్ జారిపోకుండా బాబు చేసే జిమ్మిక్కులు ఇలాగే ఉంటాయని బొత్సా విమర్శిస్తున్నాడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత మిథున్ రెడ్డి కూడా `ముందస్తు` ప్రస్తావన లేదని స్పష్టం చేస్తున్నాడు. మొత్తం మీద ముందస్తు ఎన్నికల చంద్రబాబు మాట రాజకీయ పార్టీల్లో హాట్ టాపిక్ అయింది.