YCP : మరోసారి వంశీని కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు.
- Author : Latha Suma
Date : 05-03-2025 - 4:10 IST
Published By : Hashtagu Telugu Desk
YCP : వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ ఎస్సీ , ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10 రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గతంలో వంశీపై పదహారు కేసులు నమోదయ్యాయని వివరించారు. వల్లభనేని వంశీ ప్రణాళిక ప్రకారమే ఆయన అనుచరులు ముదునూరి సత్యవర్ధన్‌ను బెదిరించి.. కిడ్నాప్ చేసి గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకునేలా చేశారని వెల్లడించారు.
Read Also: Bofors Scam: బోఫోర్స్ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్
అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన కారును అతను చాలా తెలివిగా మాయం చేశారని చెప్పారు. ఈనేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకోవాలని కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వంశీకి బెయిల్ ఇవ్వరాదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో 3 రోజుల పాటు పోలీసు కస్టడీలో వంశీ విచారణకు సహకరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో వంశీ బెయిల్ పిటిషన్, విచారణను రేపటికి వాయిదా వేశారు.
మరోవైపు మరో ఇద్దరు నిందితులను సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు మంగళవారం కస్టడీకి తీసుకున్నా రు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి గంటా వీర్రాజు, వేల్పూరి వంశీబాబులను కస్టడీలోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం పటమట పోలీ్‌సస్టేషన్‌లో విచారించారు. వారు తమకేమీ తెలియదని చెబుతూనే.. వంశీ ఏం చెబితే అదే చేశామని చెప్పి నట్టు తెలిసింది. వంశీ ప్రణాళిక ప్రకారం ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో ఆయనకి పీఏగా వ్యవహరించిన గంటా వీర్రాజు నిర్దేశించాడు. దీనిపై పోలీసులు ప్రశ్నించగా డొంకతిరుగుడు సమాధానం చెప్పాడని తెలిసింది.