HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Peddireddy Reacts On Land Encroachment

Peddireddy : భూ ఆక్రమణలపై స్పందించిన పెద్దిరెడ్డి

గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. ఈ భూములు అటవీ భూములు కాదని గతంలో అధికారులు కూడా నిర్ధారించారని కూడా తెలిపారు.

  • Author : Latha Suma Date : 29-01-2025 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Peddireddy reacts on land encroachment
Peddireddy reacts on land encroachment

Peddireddy : మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించిందని వచ్చిన ఆరోపణలపై స్పందించారు. అవి అటవీ భూములు కాదన్నారు. తాము ఇరవై ఏళ్ల కిందటే వాటిని ఆ భూములు యజమానుల వద్ద 2001లో కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నామన్నారు. అప్పట్లోనే అక్కడ పని చేసే వారి కోసం నిర్మాణాలు చేశామన్నారు. ఇప్పుడు కొత్తగా ఆ భూమిని అటవి భూమ అని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది వైసీపీ నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు.

ఆ భూములు అడవి మద్యలో ఉన్నప్పటికీ.. ప్రైవేటు భూములేననడానికి అన్ని రికార్డులు ఉన్నాయని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు ఈ భూములపై విచారణ జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విచారణ కూడా చేశారని కానీ ఎలాంటి అవకతవకలు గుర్తించలేదన్నారు. ఈ భూములు అటవీ భూములు కాదని గతంలో అధికారులు కూడా నిర్ధారించారని కూడా తెలిపారు. రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై ఇలాంటి కథనాలు రాసిన పత్రికపై తాను ఇప్పటికే యాభై కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశానన్నారు. నాపై ఎన్ని విచారణలు అయిన చంద్రబాబు వేసుకోవచ్చు. అధికారులే కాదు నేరుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చి విచారించకోవచ్చు‌‌‌ అని అన్నారు.

కాగా, పెద్దిరెడ్డి కుటుంబం పలు చోట్ల ఈ తరహా భూకబ్జాలకు పాల్పడిందన్న ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులతో జాయింట్ కమిటీ ఏర్పాటు అయింది. జాయింట్ కమిటీలో సభ్యులుగా చిత్తూరు కలెక్టర్ సుమిత్, జిల్లా ఎస్పీ మనికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోద బాయ్ ఉన్నారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.

Read Also: Congress guarantees : రేపు రాష్ట్ర‌ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు..

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Joint Committee
  • Land Grabbing Allegations
  • peddireddy ramachandra reddy
  • ysrcp

Related News

AP CM Chandrababu

CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

రాష్ట్రంలో సుపరిపాలనను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం సభలో ప్రసంగించిన ఆయన.. ఇటీవల జరిగిన పలు సంఘటనలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్త

  • TDP

    TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • AP TDP

    AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd