Peddireddy : బిజెపిలోకి పెద్దిరెడ్డి..?
ఐదేళ్లలో దాడులు చేసిన గల్లీ నేత దగ్గరి నుండి మాజీ మంత్రుల వరకు అందరికి శిక్షిస్తాం అని స్పష్టం చేసింది
- By Sudheer Published Date - 04:42 PM, Thu - 25 July 24

ఏపీ(AP)లో వైసీపీ (YCP) నేతల పరిస్థితి దారుణంగా మారింది. గడిచిన ఐదేళ్లలో నేనే రాజు..నాకు ఎదురులేదు..నేను చెప్పిందే వేదం..నేను చెప్పిందే జరగాలి..నేను ఏంచెపితే అదే..నేను ఎవర్ని చంపిన అడిగేవాడు లేడు..నా రాష్ట్రంలో నాకు ఎదురులేదు..తిరుగులేదు..అన్నట్లు వ్యవహరించారు. అధికారం ఎప్పటికి ఒకరి చేతిలోనే ఉండదు..ఇలా చెయ్యకూడదు..ప్రజలు క్షమించరు..వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది అనేది కూడా మరచిపోయి..దారుణంగా ప్రవర్తించారు. చిన్న పెద్ద లేదు..ఎవర్ని పడితే వారిని..ఎంతమాటొస్తే అంత మాట అనేసారు. కనిపించిందన్నల్లా దోచేశారు..దాచేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు చేతులు పిస్సుకుంటూ భయం భయంగా బ్రతికేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎవర్ని వదిలిపెట్టం అని తేల్చి చెపుతుంది. ఐదేళ్లలో దాడులు చేసిన గల్లీ నేత దగ్గరి నుండి మాజీ మంత్రుల వరకు అందరికి శిక్షిస్తాం అని స్పష్టం చేసింది. దీంతో శిక్షల నుండి ఎలా భయపడేలా..అని అంత ఆలోచిస్తున్నారు. పార్టీ అధినేత దగ్గరికి వెళ్లి చెప్పుకున్న ఆయనకూడా చేతులు ఎత్తేసారు. ఆయనేమైనా ఎక్కువ మాట్లాడితే ఆయన్ను లోపల వేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో వారికీ ఉన్న ఒకేఒక అప్షన్ బిజెపినే. అందుకే వైసీపీ కీలక నేతలంతా బిజెపిలో చేరాలని ప్లాన్ చేస్తున్నారు.
వైసీపీ లో కీలక నేత గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి (Peddireddy Ramachandra Reddy) కి వరుస షాకులు ఇచ్చేందుకు కూటమి సర్కార్ సిద్ధం అయ్యింది. ఇప్పటికే పలు కేసులు నమోదు కాగా.. తాజాగా మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో తన పేరు బయటకు రావడం తో ఇక తనకు ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చేసారు. ఈ ఇబ్బందుల నుండి బయటపడాలంటే బీజేపీ పార్టీ లో చేరడం తప్ప మరోటి లేదని భావిస్తున్నాడట. ఈయన మాత్రమే కాదు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ మినహా పదిమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో ఈ మాట అన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పడంతో ఎవరా..? పెద్ద మనిషి అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. మరి పెద్దిరెడ్డి ని జగన్ వదులుకుంటాడా..? లేక ఏదైనా ఆలోచిస్తారా అనేది చూడాలి.
Read Also : Heavy rains : జలదిగ్బంధంలో ముంబయి..రెడ్ అలర్డ్ జారీ