Peddapuram Constituency : జగన్ కు భారీ షాక్ ఇచ్చిన పెద్దాపురం నియోజకవర్గం నేతలు
- Author : Sudheer
Date : 16-12-2023 - 4:04 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇవ్వడం తో…ఏపీ సీఎం జగన్ (CM Jagan) జాగ్రత్తపడుతున్నాడు. మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు (AP Assembly Elections 2024) జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అభ్యర్థుల కు సంబదించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల నుండి వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు కార్యాచరణ కూడా మొదలుపెట్టాడు. ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబదించిన ఇన్ ఛార్జ్ లను మార్చడం జరిగింది. అలాగే ఈసారి 100 సీట్ల వరకు కొత్త వారికే ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో టికెట్ రాదని భావించిన నేతలు ఇతర పార్టీల వైపు చూడడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె తాజాగా జగన్ కు భారీ షాక్ ఇచ్చారు పెద్దాపురం నియోజకవర్గం నేతలు. మూడు నెలల కిందట జగన్ ప్రకటించిన అభ్యర్థిపై పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి దవులూరి దొరబాబును మార్చాలంటూ వైసీపీ కీలక నేతలు ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జిని మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పెద్దాపురం నుండి దవులూరి దొరబాబును గెలిపించాలని బహిరంగ సభలో కొద్దీ రోజుల క్రితం జగన్ ప్రకటించారు. సీఎం ప్రకటించిన అభ్యర్థిని కాదని అసమ్మతి నేతలు వ్యతిరేక గళం ఎత్తారు. వెంటనే అభ్యర్థిని మార్చకపోతే మూకుమ్మడిగా పార్టీని వీడేందుకు సిద్ధమని వెల్లడించారు. మరి జగన్ ఏంచేస్తాడో చూడాలి. తెలంగాణ లో కూడా కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉన్నప్పటికీ..మళ్లీ వారికే ఛాన్స్ ఇచ్చి బొక్క బోర్ల పడ్డాడు.
Read Also : BJP-Janasena: జనసేనతో బీజేపీ పొత్తుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు