Pawan Kalyan: పవన్ రాకతో ధాన్యం కొనుగోలు వేగవంతం
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు
- Author : Praveen Aluthuru
Date : 10-05-2023 - 3:32 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan; ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. కానీ ఫలితం లేదని వాపోతున్నారు. ఇక నష్టపోయిన పంటను, రైతన్నలను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతుల్ని పరామర్శించారు. అలాగే మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలో రైతులు తమ బాధలను చెప్పుకున్నారు. మాది రైతు ప్రభుత్వం..రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పుకునే ఏ నాయకుడు కూడా మాకు అండగా లేడని గోడు వెళ్లబోసుకున్నారు. మమ్మల్ని పరామర్శించేందుకు ఏ ఒక్క అధికారి రాలేదని బాధపడ్డారు. మీరు వస్తున్నారని తెలిసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేసినట్టు రైతులు పవన్ కు చెప్పారు. ఇప్పటివరకు అయిన ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని, ఇదే సమయంలో మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని వాపోయారు.
మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు గత ప్రభుత్వం కంటే మేమే మంచి చేస్తున్నామంటూ డబ్బా కొట్టుకునే సీఎం జగన్ అన్నదాతలు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఫైర్ అవుతున్నారు రైతులు. క్యాంపు కార్యాలయంలో కూర్చుని ల్యాప్‌టాప్‌లో బటన్ నొక్కితే సరిపోతుందా.. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకునే తీరిక లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు పాడై, ధాన్యం తడిసిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను సీఎం జగన్ కనీసం పరామర్శించకపోవడం తీవ్ర విమర్శలు తావిస్తోంది.
Read More: Revanth Vs Talasani: తలసానిపై రేవంత్ ఫైర్.. ఘాటైన పదజాలంతో కౌంటర్