Pawan Kalyan – Junior Ntr : జూనియర్ ఎన్టీఆర్ పై జనసేనాని పరోక్ష కామెంట్స్.. నెట్టింట చర్చ
Pawan Kalyan - Junior Ntr : ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో శుక్రవారం ప్రెస్ మీట్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పలు కామెంట్స్ పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది.
- Author : Pasha
Date : 07-10-2023 - 9:57 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan – Junior Ntr : ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో శుక్రవారం ప్రెస్ మీట్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పలు కామెంట్స్ పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. ‘‘సినిమా ఇండస్ట్రీ వారికి వంద రకాల సమస్యలు ఉంటాయి. 24 విభాగాల్లో పని చేసే వారికి బాధలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తారు. వారి నోళ్లలో ఎందుకు పడాలని అనుకుంటున్నారు’’ అని జనసేనాని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించినవే అనే చర్చ నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడంపై పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సినీ ఇండస్ట్రీ, రాజకీయ పార్టీలతో ముడిపడిన కొన్ని పాత విషయాలను జనసేనాని గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టినపుడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు కూడా సినిమా రంగంలో గ్రూపులు ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు సూపర్ స్టార్ కృష్ణ, ప్రభాకర్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఎన్టీఆర్ పై ఎన్నో సినిమాలు తీసినా ఆయన ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగలేదు. తనకు వ్యతిరేకంగా సినిమాలు తీసిన వారితో కూడా కలిసి నటించారు. రజినీకాంత్ లాంటి గొప్ప నటుడ్ని తిట్టని తిట్టు లేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్ ను కూడా వైసీపీ నేతలు వదిలి పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నేతల నోళ్లలో పడాలని ఎవరు మాత్రం (Pawan Kalyan – Junior Ntr) భావిస్తారు ’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.