HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Tribute To Atal Bihari Vajpayee Is A Genius Born For The Nation

Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.

  • Author : Balu J Date : 16-08-2023 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan Key Comments
Pawan Kalyan Key Comments

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో.. అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి గారిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ‘‘ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్‌పేయి గారు గురించి ఏమని చెప్పాలి. అందుకేనేమో ఆయన భారతరత్నగా మనందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవిచూసిన  వాజ్‌పేయి గారు దేశమే జీవితం అనుకొని బ్రహ్మచారిగానే మిగిలిపోయారు’’ అని అన్నారు.

‘‘సంస్కృతం, హిందీ ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన పాత్రికేయునిగా పని చేస్తూనే రాజకీయాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన నిర్వర్తించిన పదవులు ఎన్నో. జనతా ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా తన ప్రతిభను చాటుకున్నారు. పార్లమెంటేరియన్ గా ఆయన సుదీర్ఘంగా పని చేశారు’’ పవన్ గుర్తు చేశారు.

‘‘బిజెపీ అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా ఆయన  హయాంలో మన దేశం ఎన్నో విజయాలను చవిచూసింది. రాజస్థాన్ ఎడారిలో అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే. ప్రైవేటు రంగాన్ని పటిష్టపరచటం, దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు రవాణా వ్యవస్థను విస్తరించటం ఆయన సాధించిన విజయాలే. ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే ఆయన వాగ్దాటి పార్లమెంటును అబ్బురపరిచేది. విలక్షణమైన ఆయన కవితా ఝరి పామరులను సైతం ఆకట్టుకునేది’’ అంటూ పవన్ నివాళులు అర్పించారు.

Also Read: Bollywood Boxoffice: బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన గదర్-2, ఐదు రోజుల్లో 300 కోట్లు వసూల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • atal bihari vajpayee
  • Pawan Kalyan
  • tributes

Related News

Andhra Pradesh

ఏపీకి మరో భారీ పరిశ్రమ

ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి

    Latest News

    • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

    • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

    • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

    • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

    • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

    Trending News

      • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

      • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

      • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd