Pawan Kalyan : ఆంధ్ర యూనివర్సిటీపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని..
బహిరంగ సభలో వైసీపీ(YCP) నాయకుల ఆగడాలు మాట్లాడుతూనే, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University)పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.
- Author : News Desk
Date : 10-08-2023 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి యాత్ర(Varahi Yatra) మూడో విడత నేడు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. విశాఖలో(Vizag) పవన్ వారాహి మూడో విడత యాత్ర ఘనంగా మొదలుపెట్టారు. విశాఖ జగదాంబ జంక్షన్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ బహిరంగ సభలో వైసీపీ(YCP) నాయకుల ఆగడాలు మాట్లాడుతూనే, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University)పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.
పవన్ కళ్యాణ్ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ.. గతంలో ఆంధ్ర యూనివర్సీటీ 2012లో 29 ర్యాంకులో ఉంది. ఇప్పుడు 76 స్థానంలో ఉంది. అక్కడ సెక్యూరిటీ వాళ్లు గంజాయి అమ్ముతారు. మందు ఇతర అసాంఘిక కార్యకలాపాలు యూనివర్సిటీలో జరుగుతున్నాయి. ఏయుని వైసీసీ కార్యాలయం చేశారు. ఏయుని రియల్ ఎస్టేట్ గా మార్చేస్తారు. దీని గురించి కేంద్రం దృష్టికి తీసుకెళతాము. జగన్ ఏయూని భ్రష్టు పట్టించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు విశాఖలో సంచలనంగా మారాయి. మరి దీనిపై ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు, విద్యార్థులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Also Read : Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం