HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Says Open To Alliance With Tdp For 2024 Andhra Polls

Pawan Kalyan: టీడీపీతో పొత్తుకు సిద్ధమే.. ఈసారి వాళ్లే ఒక మెట్టు దిగాలి : పవన్ కళ్యాణ్

  • Author : Anshu Date : 06-06-2022 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
pawan kalyan
pawan kalyan

వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ లా ఉండకూడదని , టీడీపీ కూడా ఒక మెట్టు దిగి రావాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొన్ని మెట్లు దిగామని ఆయన గుర్తుచేశారు.

మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. “మొదటిది జనసేన, బీజేపీ పొత్తు.. రెండోది జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు.. మూడోది జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం అనే మార్గాలు ఉన్నాయి.

భవిష్యత్ సమీకరణాలను బట్టి వీటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకోవాలి అనేది నిర్ణయం అవుతుంది. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది టీడీపీ, బీజేపీలే” అని పవన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీని గద్దె దించేందుకు తాము ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, టీడీపీ కూడా తమతో కలవాలని కోరారు. పొత్తుల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ తో పొత్తు ఉన్నప్పటికీ.. కొంత గ్యాప్ ఏర్పడిన మాట నిజమేనని పవన్ ఒప్పుకున్నారు. కరోనా కారణంగా ఇరు పార్టీలు కలిసి సంయుక్త కార్యక్రమాలు నిర్వహించ లేకపోయామని చెప్పారు. సోమవారం రాజమండ్రి లో బీజేపీ నిర్వహించనున్న “గోదావరి గర్జన” కార్యక్రమం గురించి తనకు సమాచారం లేదన్నారు. ఆ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాల్గొంటారని కూడా తనకు తెలియదన్నారు.

మరోవైపు పవన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. జనసేన తో బీజేపీ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ.. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Pawan Kalyan
  • tdp
  • ysrcp

Related News

    Latest News

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    • Amaravati: అమరావతికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు

    • Low BP: లో బీపీ ఉందా.. ఇలా చేస్తే దాని ముప్పు నుంచి బయటపడొచ్చు!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd