Pawan kalyan : డబ్బులు ఖర్చుపెట్టకుండా రాజకీయం అవ్వదు.. కష్టాలొస్తే నేను కావాలి కానీ ఓట్లు వేయరు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాల గురించి మాట్లాడారు.
- By News Desk Published Date - 08:00 PM, Fri - 12 May 23

గత కొన్ని రోజులుగా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్(Pawan kalyan) మళ్ళీ పొలిటికల్ బ్రేక్ తీసుకున్నారు. ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు జనసేనాని(Janasena) పవన్. తాజాగా నేడు పవన్ కళ్యాణ్ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షులతో పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక విషయాల గురించి మాట్లాడారు.
ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణం అనేది కష్టసాధ్యమైనది. అనేక కలలు కని నేను పార్టీని స్థాపించాను. పార్టీలో నేను ఓ నాయకత్వ బాధ్యత వహిస్తున్న కార్యకర్తను. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలి అని కాదు, మార్పును కోరుకునే వాడిని. డబ్బు లేకుండా రాజకీయం చెయ్యడం సాధ్యం అని నిరూపించాం. జీరో బడ్జెక్ట్ పాలిటిక్స్ అంటే ఓట్లు కొనకుండా రాజకీయం చెయ్యాలి, డబ్బులు ఖర్చు చెయ్యకుండా కాదు. డబ్బు ఖర్చు పెట్టకుండా రాజకీయం అవ్వదు. ఓట్లు కొనకుండా రాజకీయం చెయ్యాలి. ప్రజారాజ్యం పరిస్థితులను తట్టుకుని జనసేన నిలబడింది. నేను ఒక కులానికి నాయకుడిని కాదు, అన్ని కులాలకు సమాన గౌరవం ఇస్తాను. నేను కుల రాజకీయాలు చెయ్యను, కొంత మంది నాయకుల్లా సొంత కులమే బాగుండాలని కోరుకోను అని అన్నారు.
అలాగే సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుతూ.. ఏపి అభివృద్ధి కోసం నేను కొందరికి శత్రువు అవ్వడానికి సిద్దంగా ఉన్నాను, పోగొట్టుకోవడానికి కూడా సిద్దంగా ఉన్నాను. నన్ను అనే కొద్ది నేను రాటు దేలుతుంటాను. గత ఎన్నికల్లో 40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి వచ్చి ఉండేది. కష్టాలు వస్తే పవన్ గుర్తుకు వస్తాడు కానీ ఓట్లు వేసేటప్పుడు గుర్తు రావడం లేదు. టిడిపి నాయకుల్ని సీఎం చెయ్యడానికి జనసేన లేదు. కానీ మన బలం ఎంత ఉందో బేరీజు వేసుకోవాలి. జనం రావడం కాదు, వచ్చిన జనాలను ఓట్లుగా మార్చుకోగలగాలి. అవసరం అయినప్పుడు తగ్గడం, అవసరం అయినప్పుడు తిరగబడడం ఉండాలి. NTR పార్టీ పెట్టినప్పుడు నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. MIMలా కనీసం 7 స్థానాలు కూడా గెలిపించలేదు, 2009లో ప్రజారాజ్యంపై వచ్చిన 18 స్థానాలు కూడా గెలిపించలేదు. సిఎం అభ్యర్థిగా ఉంటేనే పొత్తు అని మాట్లాడకూడదు. 2014లో సపోర్టు చేసింది సమయం లేక, మన సపోర్ట్ తో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఆనాడు పదవులు ఇస్తాం అని అన్నారు, కానీ నేను తీసుకోలేదు అని తెలిపారు పవన్ కళ్యాణ్.
ఇక జగన్, అతని బ్యాచ్ గురించి మాట్లాడుతూ.. జగన్ సకలకలా కోవిదులు. నన్ను తిట్టే బుడతల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించండి. మా పార్టీ గురించి మీకెందుకు..? జనసేన మీకు ఎందుకూ పనికి రాని పార్టీ కదా వదిలెయ్యండి. టీడీపీని అయినా వదిలేస్తున్నారు కానీ జనసేన ను వదిలెయ్యట్లేదు. ఎందుకంటే జనసేన అంటే మీకు భయం. కాపులకు రిజ్వేషన్లు ఇవ్వను అని జగన్ చీ కొట్టారు. మరెందుకు జగన్ కి కాపులు ఓట్లు వేశారు. కాపు నాయకులు నిలదీయాల్సిది జగన్ ను, నన్ను కాదు. కాపుల మధ్య గొడవలు పెడుతున్నారు. కావాలని sc st కేసులు పెట్టిస్తున్నారు. కక్ష కట్టి నా భీమ్లా నాయక్ సినిమా ఆపేశారు, 30 కోట్ల నష్టం వచ్చింది. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాను అంటున్నారు, కాపులేమైన చిన్న పిల్లలా అని అన్నారు.
ఇక పొత్తుల గురించి మాట్లాడుతూ.. పార్టీ ఎదుగుదలకి పొత్తు దోహదపడుతుంది. పొత్తుల వల్ల బలపడటం Brs పార్టీ దానికి ఉదాహరణ. రాజకీయాల్లో వ్యూహలే ఉంటాయి, వ్యూహం చాలా కీలకం. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుండి సిద్దంగా ఉంటాం అని తెలిపారు. దీంతో పవన్ ఈ సమావేశంలో మాట్లాడిన మాటలు సంచనంగా మారాయి.
Also Read : Pawan Kalyan: పొత్తులో సీఎం పదవి అడగలేం.. పవన్ కళ్యాణ్ పరోక్ష సంకేతం