PK Social Media: మా స్టార్ పై ఇన్ని రూమర్సా..? అంటూ పవన్ ఫ్యాన్ ఫైర్
మా అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా ఇన్ని రూమర్సా.. అంటూ ఇప్పుడు ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారట. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 10:29 AM, Tue - 25 January 22

మా అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియా వేదికగా ఇన్ని రూమర్సా.. అంటూ ఇప్పుడు ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారట. ఇందుకు బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ తో భారీ హిట్ అందుకున్న పవన్… ఆ వెంటనే నాలుగు చిత్రాలను అనౌన్స్ చేశారు. ఆ నాలుగు సినిమాలను వీలైనంత త్వరగా… జెట్ స్పీడ్‌లో పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలకు సూచించారు. ఆ ఊపుమీదే షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పవన్ దూకుడుకి కరోనా గట్టి బ్రేక్ వేసిందనే చెప్పాలి. సెకండ్ వేవ్ సమయంలో పవన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ‘హరిహర వీరమల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే ఆగిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్, సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడగానే ముందు ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని సెట్‌లో అడుగుపెట్టారు. అంతే స్పీడ్‌తో దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారాయన. ఒకవైపు ‘భీమ్లా నాయక్’ మూవీకి సంబంధించిన వరుస అప్‌డేట్స్ తో.. ఫ్యాన్స్‌తో పాటు, ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసి భారీ అంచనాలను అమాంతం పెంచేశారు. ముందుగా సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని జనవరి 12న రిలీజ్ అని ‘భీమ్లా నాయక్’ విడుదల తేదీని లాక్ చేశారు. ఇక్కడి దాకా అంతా సవ్యంగానే జరిగింది.
కానీ, ఎప్పుడైతే దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ కు సంబంధించి రిలీజ్ డేట్ ను ప్రకటించి, ‘భీమ్లా నాయక్’ సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారో…. అప్పటి నుంచి ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ డేట్ పై రకరకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. జనవరి నుంచి పోస్ట్ పోన్ అయిన ‘భీమ్లా నాయక్’… ఫిబ్రవరి 25న రిలీజ్ డేట్ అని ప్రకటించారు మూవీ మేకర్స్. కానీ, సొషల్ మీడియాలో మాత్రం దీనికి భిన్నంగా వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 25న రిలీజ్ కావాల్సిన సినిమా మరోసారి వాయిదా పడుతుందంటూ… సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు ఇప్పట్లో షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం థర్డ్ వేవ్ కొనసాగుతున్న నేపధ్యంలోనే ఈ విధంగా పవన్ చెప్పినట్లు సమాచారం.
కరోనా మూడో వేవ్ పరిస్థితులు అన్నీ సర్దుకున్న తర్వాతే తిరిగి మళ్లీ సెట్స్ లో అడుగుపెడతానని పవన్ చెప్పారని వార్తలు సోషల్ మీడియా వేదికగా షికారు చేస్తున్నాయి. కానీ, ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో ఇప్పటికే జాయిన్ అయ్యారట.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగానూ సాగుతుందని సమాచారం. అలాగే తాను ఒప్పుకున్న మరో రెండు సినిమాలను రెండేసి నెలల్లో పూర్తి చేస్తానని.. ఆ విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని నిర్మాతలతో పవన్ చెప్పారట. వచ్చే ఎన్నికల నాటికి ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి, ఎన్నికల రణరంగంలో దిగాలని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ‘భీమ్లా నాయక్’ , ‘హరిహర వీరమల్లు’ సినిమాల తర్వత హరీష్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ ను, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఒక సినిమాకు కమిట్ అయ్యారు.
మరోవైపు ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు బోయపాటి కూడా పవన్ కోసం ఒక సబ్జెక్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. వీటన్నిటినీ పక్కనబెట్టి సోషల్ మీడియాలో దీనికి భిన్నంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోపై ఇలాంటి రూమర్స్ ఏంటీ అని సీరియస్ అవుతున్నారట.