HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Extends Greetings To The People Of Telangana

Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • Author : Vamsi Chowdary Korata Date : 02-06-2026 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Janasena Pawan Kalyan
Janasena Pawan Kalyan

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 4:30-5:30 మధ్య మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తెలంగాణ పోలీసులు కనీసం దీనికైనా అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ఆయన నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసులు నిరాకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జనసేన పుట్టింది ఇక్కడే..
మరోవైపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని గుర్తుచేశారు. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికిపుచ్చుకున్నట్లు చెప్పారు. తెలంగాణ సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

‘‘దశాబ్దాల ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాల ప్రతిఫలమే తెలంగాణ రాష్ట్రం. పోరాటాల పుట్టినిల్లయిన ఈ గడ్డకు విశిష్టమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఫ్లోరోసిస్, రైతులు, నిరుద్యోగుల సమస్యలు కేవలం రాజకీయం కావు, అవి మానవీయ అంశాలు. ప్రస్తుతం ఐటీ, వ్యవసాయ రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలి. గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు లభించే సమగ్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో పవన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • jubilee hills
  • Telangana formation day

Related News

During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ

  • Telangana Formation Day

    Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : సీఎం రేవంత్ రెడ్డి

  • Pawan Kalyan Must Hold a Meeting Only After Apologizing: Minister Ponnam Expresses Anger

    Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

Latest News

  • Indian Govt: విదేశీయులకు కొత్త రూల్స్.. కేంద్ర హోంశాఖ కీలక మార్పులు

  • Krithi Shetty: కృతి శెట్టి పై నెటిజన్లు ట్రోల్

  • AP Sports Mega DSC: స్పోర్ట్స్ మెగా డీఎస్సీ-2025: పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా 421 క్రీడాకారుల కోటా పోస్టుల భర్తీ

  • YSRCP : కూట‌మి ప్ర‌భుత్వంలో రెండేళ్లలో ఎక్కువ‌గా న‌ష్ట‌పోయింది మ‌హిళ‌లే – స‌జ్జ‌ల

  • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd