Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
- By Latha Suma Published Date - 05:38 PM, Thu - 20 February 25

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీలో మూడు పార్టీల నేతలు సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నట్టు స్పష్టం చేశారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చారని.. అందువల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించారు. అయినా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని.. నిబద్ధతతో తన మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి
వెన్ను నొప్పి కారణంగానే రాష్ట్రంలో కొన్ని సమావేశాలకు హాజరుకాలేకపోయానని.. ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. కాగా, పవన్ కళ్యాణ్ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ఎన్డీఏ నేతలందరికీ విందును ఏర్పాటు చేశారు. విందుకు హాజరై బయటకు వస్తున్న సమయంలో పవన్‌తో జాతీయ మీడియా కాసేపు చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు.
మరోవైపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారమహోత్సవంలో ప్రధాన మోడీ , పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రమాణస్వీకార వేదిక వద్దకు వచ్చిన సమయంలో పవన్ దీక్షా వస్త్రాలు ధరించి ఉండటంతో మోడీ సరదాగా సంభాషించారు. హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని పవన్‌ను ప్రధాని అడగగా.. హిమాలయాలకు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని బదులిచ్చారు పవన్. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా ప్రశ్నించగా.. మోడీకి తనకు మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
Read Also: BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?