Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి
రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ మేరకు ఎఫ్ఏఏ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను వెల్లడించింది. అయితే గాల్లో ఢీకొన్న అనంతరం ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా, మరో విమానం రన్వే సమీపంలో భూమి మీద క్రాష్ అయ్యింది.
- Author : Latha Suma
Date : 20-02-2025 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
Plane crash : మరోసారి అమెరికాలో విమాన ప్రమాదం సంభవించింది. ఆరిజోనా రాష్ట్రంలోని మరానా రీజినల్ ఎయిర్‌పోర్టులో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్టు యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రమాదంతో మంటలు చెలరేగి భారీగా పొగలు వచ్చాయి. ఇటీవల ఒక విమానం ఒక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మరణించిన కొన్ని వారాల వ్యవధిలోనే తాజా ఘటన జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also: OTT Platforms : ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు
కాగా, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వాయవ్యంగా 30 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ మేరకు ఎఫ్ఏఏ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను వెల్లడించింది. అయితే గాల్లో ఢీకొన్న అనంతరం ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా, మరో విమానం రన్వే సమీపంలో భూమి మీద క్రాష్ అయ్యింది. ఆ వెంటనే ఆ విమానంలో మంటలు చెలరేగాయి.
ప్రమాదానికి గురైన రెండు విమానాలను అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (ఎన్టీఎస్బీ) గుర్తించింది. అవి లాన్ షైర్ 360 ఎంకే 2 విమానం, సెస్నా 172 ఎస్ ఎయిర్క్రాఫ్ట్. సెస్నా సురక్షితంగా ల్యాండ్ అయిందని, లాన్షైర్ కిందపడటంతో మంటలు చెలరేగాయని తెలిపింది. విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు మరానా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది.