Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
- By Sudheer Published Date - 12:27 PM, Fri - 26 January 24

ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించగా..ఈరోజు రిపబ్లిక్ డే సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం తమ పార్టీ నుండి మొదటి రెండు స్థానాలను ప్రకటించారు. రాజోలు (Rajool ), రాజానగరం (Rajanagaram) నుంచి తమ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నట్లు తెలిపి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘ఆర్’ అక్షరం తనకు బాగా నచ్చుతుందని ప్రకటించిన ఆయన… రిపబ్లిక్ డే రోజున జనసేన పోటీ చేసే రెండు అసెంబ్లీ స్థానాల పేర్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
రిపబ్లిక్ డే వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్త ధర్మం ప్రకారం టీడీపి వాళ్ళు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. కానీ, మండపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, దీనిపై మండపేట జనసేన నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా వారితో తాను ఏకీభవిస్తున్నట్టు తెలిపారు.
చంద్రబాబుకు ఏ విధమైన ఒత్తిడి ఉంటుందో, అలాంటి ఒత్తిడి తనకు కూడా ఉంటుందని, అందువల్లే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్టు తెలిపారు. రాజోలు, రాజనగరం అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. దీనిని టీడీపీ అర్థం చేసుకుంటుందని పవన్ చెప్పుకొచ్చారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని.. కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా తప్పవన్నారు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లను తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని.. భవిషత్‌లో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమిని గెలిపించాలని పవన్ కోరారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని తెలిపారు. పార్టీ లో అందరికి న్యాయం జరుగుతుందని..మీకు భరోసా నేను ఇస్తున్నానని …నన్ను నమ్మండి అంటూ పవన్ పార్టీ నేతలకు , కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
Read Also : Banned Cricketers: డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఆటగాళ్లు.. నిషేధం విధించిన క్రికెట్ బోర్డు