Pawan Kalyan : ఢిల్లీలో ఏపీడిప్యూటీ సీఎం బిజీ బిజీ
Pawan Kalyan : మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)తో... 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ (Lalan Singh)తో
- Author : Sudheer
Date : 26-11-2024 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ లో బిజీ బిజీ గా గడపనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో.. సాయంత్రం 3:15 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో.. 4:30కు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)తో… 5:15కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ (Lalan Singh)తో.. బుధవారం ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi)తో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.
ప్రస్తుతం కేంద్రం వద్ద పవన్ కళ్యాణ్ స్థాయి మరింతగా పెరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితం అన్నట్లు కొంతమంది రాజకీయ నేతలు భావించిన..ప్రధాని మోడీ మాత్రం పవన్ లో పవర్ ఉంది..ఆ పవర్ ఎక్కడైనా పనిచేస్తుందని నమ్మాడు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను వాడుకొని సక్సెస్ అయ్యాడు.
తాజాగా మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో (Maharashtra Elections) మహాయుతి ప్రభంజనం (Mahayuti alliance) సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడం తో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా బిజెపి హావ నడుస్తుందని..ప్రజలంతా బిజెపినే కోరుకుంటున్నారని మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రుజువైంది.288 స్థానాలకుగాను అధికార కూటమి 234 స్థానాల్లో విజయం సాధించగా.. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ 51 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరుఫున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. లాతూర్, షోలాపూర్ సహా పలుచోట్ల మహాయుతి కూటమి అభ్యర్థుల తరుఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. బహిరంగసభలతో పాటుగా ర్యాలీలలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్లా బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు. పవన్ కళ్యాణ్ వల్లే ఈరోజు తాము విజయం సాధించామని పబ్లిక్ గా తేల్చి చెప్పారు. దీంతో పవన్ సత్తా ఏంటో నేషనల్ వైడ్ గా రాజకీయ నేతలకే కాదు ప్రజలకు సైతం అర్థమైంది. ఈ క్రేజ్ ను పూర్తిగా వాడుకునేందుకు బీజేపీ చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సనాతన ధర్మం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో జనసేనానికి దేశ వ్యాప్తంగా ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. బీజేపీ తర్వాత ఓ పార్టీ నాయకుడు హిందూత్వం గురించి ఈ రేంజ్ లో ఉపన్యాసాలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఆకాశామంత పెరిగిందనే చెప్పాలి. దీంతో ఆయన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల్లో ఆయన సినిమాలు కూడా తెలియని వాళ్లు కూడా పవన్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. అంతేకాదు దక్షిణాదిలో హిందుత్వకు ఐకాన్ గా మారాడు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ నాయకులు చేయలేని పనిని జనసేనాని చేసి పెడుతున్నాడు. ఆ పార్టీ నాయకులే మాట్లాడానికి సంకోంచే విషయాలను కూడా ఎంతో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఓ రకంగా దక్షిణాది యోగిగా ఎదిగారు. మరి రాబోయే రోజుల్లో మోడీ వద్ద పవన్ స్థాయి ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.
Read Also : Instagram: ఇంస్టాగ్రామ్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. త్వరలోనే మరో నయా ఫీచర్!