Pawan’s Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యలకు పవన్ చెక్ !!
Pawan's Key Decision : ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు మత్స్యకార ప్రతినిధులు,
- By Sudheer Published Date - 12:31 PM, Wed - 24 September 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల (Pharmaceutical industries) ప్రభావం వల్ల తీరప్రాంత మత్స్యకారులు ఎదుర్కొంటున్న జీవనోపాధి సమస్యలు, పడవలకు కలిగిన నష్టాలు, బీమా చెల్లింపులు వంటి అంశాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా మత్స్యకారులను వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయినా, వారి సమస్యలపై నిరంతర చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి మత్స్యకారులు ప్రస్తావించిన ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని త్వరితగతిన పరిష్కారాలు కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు.
ITI College : తెలంగాణ లో కొత్తగా మరో 4 ఐటీఐ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎక్కడెక్కడంటే !!
ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ, ఫిషరీస్, రెవెన్యూ అధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో పాటు మత్స్యకార ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఈ కమిటీలో చేర్చనున్నారు. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయాల్సిన సిఫారసులతో నివేదికను అందించనుంది. ఉప్పాడ తీరప్రాంత గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల, నష్టపరిహారం చెల్లింపులు వంటి అంశాలపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించనుంది. నివేదిక కోసం ఎదురుచూడకుండా అత్యవసరంగా పరిష్కరించాల్సిన అంశాలపై చర్యలు ప్రారంభించామని పవన్ స్పష్టం చేశారు.
ఇప్పటికే మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తంపై, అలాగే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర నష్టపోయిన పడవలకు పరిహారం చెల్లింపులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పవన్ తెలిపారు. అదనంగా, మచిలీపట్నం, అంతర్వేది వంటి ఇతర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశాలను కల్పించే విషయమై కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో కూర్చొని, వారి సమస్యలను నేరుగా వినిపించుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని, వారిని భరోసా కల్పించే విధంగా అన్ని చర్యలు కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.