ITI College : తెలంగాణ లో కొత్తగా మరో 4 ఐటీఐ కాలేజీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..ఎక్కడెక్కడంటే !!
ITI College : రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన టెక్నికల్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా నాలుగు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ITI )ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- By Sudheer Published Date - 12:21 PM, Wed - 24 September 25

తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన టెక్నికల్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా నాలుగు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ITI )ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అచ్చంపేట సమీపంలోని కొండారెడ్డి, శామీర్‌పేట శివారులోని జినోమ్ వ్యాలీ, ఖమ్మం జిల్లా మధిర, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాల్లో ఈ కొత్త ఐటీఐలు స్థాపన కానున్నాయి. ఇప్పటికే అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించగా, రానున్న మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా జినోమ్ వ్యాలీ ప్రాంతంలో పరిశ్రమలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అక్కడ టెక్నికల్ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం
ఈ ఐటీఐలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సూచించిన ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండటంతో, నిర్మాణానికి పెద్ద ఆటంకం లేకుండా త్వరగా పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐల్లో 98 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయి. దీని ద్వారా ఈ రంగంపై విద్యార్థుల ఆసక్తి ఎంత పెరిగిందో అర్థమవుతోంది. భవిష్యత్తులో నైపుణ్యాధారిత ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇది స్పష్టమవుతోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఏ ప్రాంతాల్లో ఐటీఐ అవసరం ఉందో గుర్తించి, కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తోంది.
ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యా రంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో “యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు”ను నిర్మించే ప్రణాళికలో భాగంగా ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున కేటాయించింది. ప్రస్తుతం 78 పాఠశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా “పబ్లిక్ స్కూల్స్” పైలట్ ప్రాజెక్టును నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ప్రారంభించనుంది. వీటిలో ఉచిత టిఫిన్, మధ్యాహ్న భోజనం, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు రూ.12 కోట్ల రూపాయల ఖర్చు అంచనా వేయబడింది. ఈ విధంగా ప్రాథమిక స్థాయి నుంచి టెక్నికల్ స్థాయి వరకు విద్యా రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, తెలంగాణ యువతకు మంచి భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్రంగా పనిచేస్తోందని చెప్పవచ్చు.