Pawan Kalyan : పవన్ అంటే లోకల్ అనుకుంటివా..? కాదు.. నేషనల్
Pawan Kalyan : 2024 ఎన్నికల్లో తన పార్టీ జనసేన (Janasena) పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించి ఓ అరుదైన రికార్డు సృష్టించారు
- Author : Sudheer
Date : 14-03-2025 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Pawan Kalyan : 2024 ఎన్నికల ముందు వరకు కూడా చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే స్టేట్ వరకే అనుకున్నారు కానీ 2024 ఎన్నికల విజయం (2024 Elections) తో పవన్ కళ్యాణ్ స్టేట్ కాదు సెంట్రల్ అని అందరికి అర్థమైంది. సినిమాల్లో హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా ఏ హీరోకు లేనంత క్రేజ్ ను పవన్ సంపాదించుకున్నారు. కేవలం సినిమాలే కాదు రాజకీయాల్లోనూ ‘ పవర్ ‘ స్టార్ అనిపించుకున్నాడు.
IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేసాడు!
2024 ఎన్నికల్లో తన పార్టీ జనసేన (Janasena) పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించి ఓ అరుదైన రికార్డు సృష్టించారు. ఈ ఘనత భారతదేశ రాజకీయ చరిత్రలో చాలా తక్కువ మంది నాయకులకు దక్కింది. స్టేట్ లెవెల్ పాలిటిషియన్‌గా మాత్రమే చూసిన వారికీ, పవన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా కీలక శక్తిగా మారతారని అర్థమైంది. రాజకీయాల్లో 12 ఏళ్ల పోరాటం తర్వాత ఆయన సాధించిన ఈ విజయాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.
జనసేన విజయాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆశ్చర్యపోయారు. ఓ రాజకీయ కార్యక్రమంలో దిగ్గజ నేతల సమక్షంలో పవన్ కళ్యాణ్‌ను “పవన్ కాదు.. తుఫాన్” అని ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ హోదా, పవన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఆయన డిప్యూటీ సీఎం కావడం మాత్రమే కాదు, భారతదేశ రాజకీయ చరిత్రలో అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుల నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుల వరకు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది జనసేన రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయి అని చెప్పొచ్చు.
Donald Trump : జన్మతః పౌరసత్వం రద్దు ..సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్
ఇక పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో కోట్లాది సంపాదించినా, దానధర్మాల్లో కూడా అంతే ముందుంటారు. గతంలో రైతుల ఆత్మహత్యల సందర్భంలో ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు కోటిన్నర రూపాయలు సహాయం చేశారు. తన సినిమాల ద్వారా వచ్చిన సంపాదనలో చాలా భాగాన్ని ప్రజలకు అంకితం చేయడం ద్వారా నిజమైన ప్రజానాయకుడిగా నిలిచారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50 లక్షల విరాళం ఇచ్చి మరోసారి తన మానవతా గుణాన్ని చాటుకున్నారు. రాజకీయాల్లోనూ ఇదే నిజాయితీతో ముందుకు సాగుతూ, ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా మార్చి రాజకీయాలను మలుస్తున్న పవన్ కళ్యాణ్, భవిష్యత్‌లో మరింత ప్రభావశీలమైన నాయకుడిగా మారబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.