HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trump Moves Supreme Court To Revoke Birthright Citizenship

Donald Trump : జన్మతః పౌరసత్వం రద్దు ..సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్‌

మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..?కాదా..?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు.

  • Author : Latha Suma Date : 14-03-2025 - 11:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump moves Supreme Court to revoke birthright citizenship
Trump moves Supreme Court to revoke birthright citizenship

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఆదేశాలను ఫెడరల్‌ కోర్టులు నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టుకు చేరారు. యాక్టింగ్‌ సొలిసిటర్‌ జనరల్‌ సారా హారిస్‌ ఈ పిటిషన్‌ సాధారణమైనదని అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..?కాదా..?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు.

Read Also: BJP : నామినేటెడ్ పదవులపై అధిష్టానం నిర్ణయం : పురంధేశ్వరి

ఇటీవల ట్రంప్‌ సర్కారు తొలగించిన పలువురు ప్రొబేషనరీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్‌ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్‌ ఆర్డర్లు జారీ చేశాయి. ఈ ఆదేశాలు దేశ ఎగ్జిక్యూటివ్‌ విభాగాన్ని రాజ్యంగపరమైన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయన్నారు.

ఇకపోతే..అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టినవారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతిఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో దీనికి బ్రేక్‌ పడింది.

ట్రంప్‌ ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే, తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. 2024 చివరినాటికి 5.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47 శాతం భారతీయులే. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు ఉన్నారు.

Read Also: Jana Sena 12th Foundation Day : జనసేన విజయం వెనుక అసలు కారణాలు ఇవే

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthright citizenship
  • California
  • Donald Trump
  • Federal Courts
  • Probationary employees
  • Supreme Court

Related News

Trump makes a sensational move at the G7 summit!

G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా జరిపిన సైనిక దాడుల్లో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, నావికుల భద్రతను నిర్ధారించడం ప్రపంచ దేశాల సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కిచ

  • $100,000 fee for H-1B again

    H-1B Visa: మళ్లీ హెచ్-1బీ కి లక్ష డాలర్ల ఫీజు

  • US-Iran peace deal reached... Oil prices crash.

    కుదిరిన అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. కుప్పకూలిన చమురు ధరలు

  • Setback for Meenakshi Natarajan in Supreme Court

    Meenakshi Natarajan: సుప్రీం కోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్‌

  • Trump agrees to US peace deal with Iran.

    Donald Trump: ఇరాన్‌ తో అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకారం ట్రంప్

Latest News

  • FIFA WC 2026: 200వ గోల్‌ తో చరిత్ర సృష్టించిన మెస్సీ

  • Vishnu priya: మరో వివాదంలో విష్ణుప్రియ.. ‘నా బాడీ కౌంట్ 5’….

  • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

  • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd