AP Election Results : వైసీపీకి 123 స్థానాలు వస్తాయి – పరిపూర్ణానంద
ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు
- By Sudheer Published Date - 08:39 PM, Mon - 3 June 24

గత 20 రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ ఎన్నికల ఫలితాల సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాదించబోతుంది..? ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారు..? ఎవరు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..? ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది..? సైకిల్ జోరా…? ఫ్యాన్ గాలి స్పీడా..? అనేది తెలియబోతుంది. దీనిపై తెలుగు రాష్ట్ర ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో మహిళలు, పురుషులు, వృద్ధులే కాదు విదేశాల్లో ఉన్న NRI లు మండు ఎండలను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. దీంతో పోలింగ్ శాతం పెరగడం ఏ పార్టీకి కలిసొస్తుందో అనే ఆసక్తి నెలకొంది.
ఇక ఎగ్జిట్ పోల్స్ సైతం కొన్ని సంస్థలు కూటమికి జై కొడితే..మరికొన్ని సంస్థలు వైసీపీకి జై కొట్టాయి. ఈ తరుణంలో ఏపీలో జగన్ రెండోసారి సీఎం అవుతారని ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి 123 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామీణ మహిళలు అధికశాతం YCPకే ఓట్లు వేశారన్నారు. దేశంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మూడో సారి మోదీ ప్రధాని అవుతారని అంచనా వేశారు. మరి ఈయన చెప్పినట్లే ఫలితాలు వస్తాయా..? లేదా అనేది చూడాలి.
Read Also : AP Election Results : ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ..