Young Boy Dies: కోడి పందాల్లో విషాదం.. కోడి కత్తి గుచ్చుకుని యువకుడు మృతి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి కోడి పందాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు (Young Boy Dies) మృతిచెందాడు.
- Author : Gopichand
Date : 15-01-2023 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. నల్లజర్ల మండలంలోని అనంతపల్లి కోడి పందాల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి గుచ్చుకుని పద్మారావు అనే యువకుడు (Young Boy Dies) మృతిచెందాడు. కోడి పందాల బరిలో తొక్కిసలాట జరగడంతోనే పద్మారావుకు కోడి కత్తి తెగినట్లు సమాచారం. పోలీసులు పద్మారావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: IndiGo Flight: ఇండిగో విమానంలో విషాదం.. ప్రయాణికుడు మృతి
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందెలు నిర్వహిస్తున్నారు. ఈ పందెలు నిర్వహించవద్దని కోర్టు ఆదేశించింది. అయినా కూడా కోడిపందెలు నిర్వహిస్తున్నారు. కోడి పందెల నిర్వహణ సమయంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా ప్రచారం సాగుతుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మూడు రోజుల పాటు కోడిపందెలు, గుండాట, ఎడ్ల పందెలు నిర్వహిస్తారు. కోడిపందెల కోసం ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేస్తారు.