HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Only Men Offer Pongallu In This Kadapa Temple

Kadapa Temple:ఆ ఆల‌యంలో పొంగ‌ళ్లు స‌మ‌ర్పించేది పురుషులేన‌ట‌.. !

సాధార‌ణంగా ఏ ఆల‌యంలోనైనా దేవ‌త‌ల‌కు, దేవుళ్ల‌కు పొంగ‌ళ్లు మ‌హిళా భ‌క్తులు స‌మ‌ర్పిస్తారు కానీ ఆ ఆల‌యంలో అందుకు భిన్నంగా జ‌రుగుతుంది. క‌డ‌ప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆల‌యంలో ఇది జ‌రుగుతుంది.

  • Author : Hashtag U Date : 10-01-2022 - 9:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sri Sanjeevaraya Anjaneya S Imresizer
Sri Sanjeevaraya Anjaneya S Imresizer

సాధార‌ణంగా ఏ ఆల‌యంలోనైనా దేవ‌త‌ల‌కు, దేవుళ్ల‌కు పొంగ‌ళ్లు మ‌హిళా భ‌క్తులు స‌మ‌ర్పిస్తారు కానీ ఆ ఆల‌యంలో అందుకు భిన్నంగా జ‌రుగుతుంది. క‌డ‌ప జిల్లాలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో హనుమంతుని ఆల‌యంలో ఇది జ‌రుగుతుంది. ప్రత్యేకించి గ్రామ దేవతల దేవాలయాలలో, సంజీవరాయ ఆలయంలో నైవేద్యాన్ని సమర్పించే హక్కు పురుషులకు మాత్రమే ఉంటుంది. ఇదే ఇక్క‌డి ఆచారంగా ఆ గ్రామ‌స్తులు భావిస్తున్నారు

ఈ ఆలయంలోకి మహిళలకు ప్ర‌వేశం లేదు. అయితే యుక్తవయస్సు రాని బాలికలకు మాత్రం అనుమతి ఉంది. శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని పాటిస్తూ గ్రామంలోని అన్ని ఇళ్లలోని పురుషులు ‘మకర సంక్రాంతి’కి ముందు ఆదివారం ‘పొంగళ్లు’ వండడానికి కావలసిన పదార్థాలు, పాత్రలను ఆలయానికి తీసుకెళ్తారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ‘పొంగళ్లు’ వండుకుని పీఠాధిపతికి సమర్పిస్తారు. ఆలయం నుంచి తీసుకువ‌చ్చే ప్ర‌సాదాన్ని మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌ర‌ని… ఇది చాలా కాలంగా ఉన్న సంప్రదాయంగా.. తరతరాలుగా దీనిని అనుసరిస్తున్నామని గ్రామ‌స్తులు తెలిపారు.ఈ గ్రామస్థులకు సంక్రాంతి కంటే ఈరోజు ఈ ఆచారం చాలా ముఖ్యమ‌ని తిప్పాయపల్లెకు చెందిన రమేష్ నాయుడు తెలిపారు. ఈ పూజలు చేయడం వల్ల వారి కుటుంబాలు అనారోగ్యం, చెడు శకునాల నుండి రక్షించబడతాయని, ముఖ్యంగా వారు సుభిక్షంగా ఉంటారని తెలిపారు

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక వృద్ధ ‘సాధు’ (సన్యాసి) ఈ గ్రామాన్ని సందర్శించి, కొంతకాలం అక్కడ ఉండేవాడని గ్రామ పెద్దలు చెబుతారు. అతను హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాడని.. అతనికి సంజీవరాయ అని పేరు పెట్టార‌ని తెలిపారు. ఈ సాధు పురుషుల నుండి మాత్రమే ఆహారాన్ని స్వీకరించారని ఇక్క‌డి గ్రామ‌స్తులు తెలిపారు. ఊరు విడిచి వెళ్లే సమయంలో సంజీవరాయుడిని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, శ్రేయస్సు లభిస్తాయని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anjeevaraya Swamy temple
  • centuries-old tradition
  • kurnool
  • only men offering pongal
  • Thippayapalli
  • women not allowed

Related News

Kurnool Rape Case

Crime News: స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి..

Kurnool Rape Case  ఏపీలోని కర్నూలులో అమానుష ఘటన వెలుగు చూసింది. పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇద్దరూ రోజుల తరబడి లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చింది. సోమవారం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగర శివారు గ్రామానికి చెందిన ఓ బాలిక రోజూ ఆటోలో పాఠశాలక

  • Ap Police Recruitment

    APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd