HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >One Lakh Crore Investment In Ap Foreign Company Proposal

Saudi Aramco : ఏపీలో ఒకేసారి లక్ష కోట్ల పెట్టుబడి.. ఫారిన్‌ కంపెనీ ప్రపోజల్‌..!

ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి.

  • By Latha Suma Published Date - 02:12 PM, Thu - 26 December 24
  • daily-hunt
One lakh crore investment in AP.. Foreign company proposal..!
One lakh crore investment in AP.. Foreign company proposal..!

Saudi Aramco : టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే ఒక్కసారిగా ఏపీ భవిష్యత్తే మారిపోయింది. అప్పటిదాకా ఏపీ వైపు కన్నెత్తి చూడాలంటేనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హడలెత్తిపోయాయి. నాడు వైసీపీ జమానాలో జగన్ అండ్ కో సాగించిన దౌర్జన్య కాండనే ఇందుకు కారణమని స్వయంగా ఆయా కంపెనీల యాజమాన్యాలే బహాటంగా ఆరోపణలు గుప్పించాయి. అయితే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి పాలన మొదలు కాగానే… పారిశ్రామికవేత్తల్లోని సదరు భయాలు పటాపంచలయ్యాయి. ఏపీలో ఉన్న అపారమైన వాణిజ్య, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆయా కంపెనీలు పోటీలు పడుతున్నాయి. ఈ కంపెనీలకు ఇప్పుడు ఫారిన్ కంపెనీలు కూడా తోడయ్యాయి.

దేశంలోని అత్యంత పొడవైన తీరం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. వెరసి ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చమురు శుద్ధి రంగంలో ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా కొనసాగుతున్న సౌదీ అరాంకో ఏపీలో ఏకంగా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ దిశగా సదరు కంపెనీ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోనూ చర్చలు మొదలుపెట్టింది.

ఏపీలో అందుబాటులో ఉన్న పొడవైన తీర ప్రాంతం… ఆ తీరం వెంట ఇటీవలి కాలంలో వరుసబెట్టి అందుబాటులోకి వచ్చిన పోర్టులు… రాష్ట్ర రూపు రేఖలను మార్చివేశాయని చెప్పక తప్పదు. ఈ క్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏపీలో ఓ భారీ చమురు శుద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని తలచింది. అందుకోసం ఇప్పటికే ఈ కంపెనీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటుగా సదరు ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం అవసరమైన ప్రాథమిక చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం సదరు కంపెనీ రూ.6,100 కోట్లతో పనులు మొదలుపెట్టేసింది.

బీపీసీఎల్ తో జత కట్టి… ఏపీలో భారీ ఆయిల్ రీఫైనరీని ఏర్పాటు చేయాలని సౌదీ అరాంకో భావిస్తోంది. నెల్లూరు జిల్లా పరిధిలోని రామాయంపట్నం పోర్టు సమీపంలో ఈ ప్రాజెక్టును నిర్మించాలని సదరు కంపెనీ తలపోస్తున్నట్లుగా సమాచారం. ఇందుకోసం సదరు కంపెనీ ఏకంగా రూ.1 లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధపడినట్లుగా కూడా సమాచారం. ఈ ప్రాజెక్టులో ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే దిశగా సౌదీ అరాంకో భావిస్తోంది.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న నిరవధిక యుద్ధం నేపథ్యంలో… భారత్ కు రష్యా అత్యంత చవకగా చమురును అందజేస్తోంది. ఇలా రష్యా అందిస్తున్న చమురు అరబ్ దేశాల మీదుగానే భారత్ కు వస్తోంది. ఈ పరిస్థితులను లోతుగా పరిశీలించిన సౌదీ అరాంకో… భారత్ కు తామే మరింత మేర చమురును అందిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచించింది. అనుకున్న వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సదరు సంస్థ సంప్రదింపులను మొదలుపెట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లు బీపీసీఎల్ తో కలిసిసౌదీ అరాంకో చేపట్టనున్న రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను ఎగురవేసేకునిపోయేందుకు యత్నించాయి.

అదే సమయంలో ఏపీ తరఫున సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగిపోయారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో పాటుగా బీపీసీఎల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూనే… మరోవైపు సౌదీ అరాంకోతో కూడా నెగోషియేషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఏపీలో ఉన్న తీరం, దాని పొడవునా ఏర్పాటైన పోర్టులను చంద్రబాబు.. అరాంకో ప్రతినిధుల ముందు పెట్టారు. చంద్రబాబు ప్రతిపాదనలకు ఫిదా అయిన అరాంకో… తమ వెంచర్ ను ఏపీలో ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు.

ఏపీ వైపు అరాంకో ఆసక్తి చూపే విషయంలో చంద్రబాబు నడిపిన మంత్రాంగంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అరాంకో ప్రాజెక్టును ఎగురవేసేకుని పోయేందుకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లు రెండూ ఏపీ కంటే బలమైన రాష్ట్రాలే. మహారాష్ట్రలో ఏపీ మాదిరే కూటమి సర్కారే ఉన్నా… ఉత్తర ప్రదేశ్ లో మాత్రం బీజేపీ సర్కారే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పాలిత రాష్ట్రం యూపీకే ఈ ప్రాజెక్టు వెళుతుందన్న వాదనలు వినిపించాయి. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ… చంద్రబాబు తనదైన శైలి మంత్రాంగం నడిపారు. కేంద్రంలోని పెద్దలతో పాటుగా బీపీసీఎల్ ప్రతినిధులతో నిత్యం సంప్రదింపులు జరిపిన చంద్రబాబు… విభజన నేపథ్యంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీకి అరాంకో లాంటి కంపెనీ వచ్చిందంటే… రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని,ఆ దిశగా తమకు సహకరించాాలని కూడా చంద్రబాబు వారిని కోరారు.

ఈ ప్రతిపాదనలకు మోదీ సర్కారుతో పాటు బీపీసీఎల్ కూడా మెత్తబడిపోగా… అప్పటికే అరాంకో ప్రతినిధులను కూడా ఏపీ వైపు చేసేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. ఫలితంగా రెండు బలమైన రాష్ట్రాలను వెనక్కు నెట్టేసి… ఏపీకి అరాంకోను చంద్రబాబు తీసుకొచ్చారు. అరాంకో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సౌదీలో పర్యటించనున్న చంద్రబాబు అరాంకో ప్రతినిధి బృందంతో భేటీ కానున్నట్లు సమాచారం. ఆ సమయంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి.

Read Also: Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • CM Chandrababu
  • Foreign company
  • One lakh crore investment
  • Saudi Aramco

Related News

Ips Sanjay

IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

IPS Sanjay : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ (IPS Sanjay) రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 వరకు పొడిగించింది

  • Star Hotel

    Amaravati Hotels : అమరావతికి స్టార్ హోటళ్ల కళ

  • Vizag It Capital

    Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • Cbn Google

    Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

Latest News

  • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

  • Diwali 2025 Discount: దీపావళికి ముందే టయోటా నుంచి మ‌రో కారు.. ఫీచ‌ర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  • Rohit Sharma- Virat Kohli: రోహిత్, విరాట్ భవిష్యత్తుపై అజిత్ అగార్కర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd