HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >New Digital Ration Cards For 1 21 Crore People

New Ration Cards : ఏపీలో కోటి 21 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు – మంత్రి మనోహర్ కీలక ప్రకటన

New Ration Cards : రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

  • By Sudheer Published Date - 08:29 PM, Tue - 29 July 25
  • daily-hunt
Manohar Ration Cards
Manohar Ration Cards

ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కోటి 21 లక్షల మందికి కొత్త డిజిటల్ రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మే నెల మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇక రేషన్ కార్డుల పంపిణీపై ప్రజల్లో నెలకొన్న అనేక అనుమానాలకు తెరపడింది. కొత్త కార్డులను ఈ నెల ఆగస్ట్ 25 నుంచి 31 వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ స్మార్ట్ రేషన్ కార్డులు QR కోడ్ తో డిజిటల్ విధానంలో ముద్రించబడతాయని మంత్రి వివరించారు. ఇవి డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల్లా ఉండి, సులభంగా తీసుకెళ్లదగిన విధంగా రూపొందించబడ్డాయని చెప్పారు. ఈ కార్డులను రేషన్ షాపుల్లో ఈ-పోస్ యంత్రాలతో స్కాన్ చేసి, రేషన్ సరుకులు పొందవచ్చని వివరించారు. స్కాన్ చేసిన వెంటనే కుటుంబ వివరాలు, లబ్దిదారులకు అర్హతల వివరాలు కనిపిస్తాయని అన్నారు. ఇకపై రేషన్ కార్డులపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు.

Breakup : బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మీరు ఫుల్ హ్యాపీ

ఇప్పటివరకు కొత్త కార్డులకు దరఖాస్తు చేసిన వారి సంఖ్య 9 లక్షలు, మార్పులు-చేర్పుల కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య 16 లక్షలు దాటినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.45 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. కార్డులో యజమాని మరియు కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉంటాయని స్పష్టంగా తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించి ఆధునికీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

కొత్త స్మార్ట్ కార్డుల ముద్రణ కోసం ఇటీవల ఏపీటీఎస్ ద్వారా టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం కార్డుల ముద్రణ వేగంగా జరుగుతోందని, అన్ని అర్హులకూ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సమయానికి రేషన్ కార్డు అందేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక టీంలు నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడనుందని, భవిష్యత్‌లో డిజిటల్ సేవల విస్తరణకు ఇదొక మైలురాయిగా నిలవనుందని అభిప్రాయపడ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Nadendla Manohar
  • New digital ration cards for 1.21 crore people
  • New Ration Cards

Related News

Cbn Google

Google : అప్పుడు HYDకు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ – చంద్రబాబు

Google : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ ఐటీ హబ్‌గా మార్చే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు

  • Group-1 Candidates

    Bankacherla Project : బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

  • Fake Alcohol

    Fake Alcohol : నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు యాప్ – చంద్రబాబు

  • Botsa Satyanarayana

    Conspiracy : మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర – బొత్స

  • Ap Fake Liquor Case

    Fake Liquor Case : నకిలీ మద్యం కేసులో మరో ఏడుగురిపై కేసు

Latest News

  • Azithromycin Syrup: అజిత్రోమైసిన్ సిరప్ లో పురుగులు

  • CCTV Camera In Bathroom: బాత్రూంలో సీక్రెట్ కెమెరా.. ఓనర్ అరెస్ట్

  • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

  • Siddhu Jonnalagadda : తెలుసు కదా రివ్యూ!

  • Maoists : ఖాళీ అవుతున్న మావోయిస్టుల కంచుకోటలు

Trending News

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd