3 Capitals: కొత్త క్యాబినెట్ లో 3 రాజధానులు?
కొత్త మంత్రివర్గం తొలి సమావేశం ఈనెల 13న జరగనుంది.
- By CS Rao Published Date - 08:40 PM, Sun - 8 May 22

కొత్త మంత్రివర్గం తొలి సమావేశం ఈనెల 13న జరగనుంది. కీలక నిర్ణయాలను ఎజెండాగా తీసుకుంటారని తెలుస్తుంది. మూడు రాజధానుల బిల్లు మరోసారి కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
ఇటీవల ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే, నూతన మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్ ఇప్పటిదాకా సమావేశం కాలేదు. ఇప్పుడా భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13న సీఎం జగన్ కొత్త క్యాబినెట్ తో సమావేశం కానున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు లేవు. ఆ క్రమంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గానికి సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ భేటీలో అనేక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. సంచలన నిర్ణయాలను తీసుకోబోతున్నారు.