Nara Lokesh : వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో చెప్పిన నారా లోకేష్ .. ట్వీట్ వైరల్
సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం.. కూటమి జెండా ఎగుర వేద్దాం అనే ట్యాగ్ తో ఓ పోస్ట్ షేర్ చేశారు
- Author : Sudheer
Date : 02-04-2024 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఎవరు ఎక్కడ తగ్గడం లేదు..మాటకు మాట, సవాల్ కు ప్రతిసవాల్ , విమర్శకు ప్రతివిమర్శ లు చేసుకుంటూ ఎవరికీ వారు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. కేవలం బహిరంగ సభల్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ డైలాగ్ ల పరంపరను కొనసాగిస్తున్నారు.
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) వైసీపీని ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించారు. సైకిల్ మీద కమలం పెట్టుకుని, జనసేన గ్లాస్ చేతపట్టుకుని, ఎదురొచ్చిన వైసీపీని తొక్కుకుంటూ వెళ్దాం.. కూటమి జెండా ఎగుర వేద్దాం అనే ట్యాగ్ తో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రస్తుతం నారా లోకేష్ ఎక్కువ సమాయం మంగళగిరి లోనే కేటాయిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన లోకేష్..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. అటు అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో మండుఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తున్నారు. ఈ వయసులో ఆయన పడుతున్న కష్టం చూసి టీడీపీ శ్రేణులు అయ్యో అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also ; Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్