Kalvakuntla Kanna Rao : కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్
Kalvakuntla Kanna Rao : బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు.
- By Pasha Published Date - 01:43 PM, Tue - 2 April 24

Kalvakuntla Kanna Rao : బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ భూవివాదంలో ఆయన్ను పోలీసులు ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా కల్వకుంట్ల కన్నారావు సింగపూర్‌కు పరారైనట్టు అంతకుముందు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పోలీసులు కన్నారావును అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఏమిటీ కేసు ?
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ పరిధి సర్వే నంబర్ 32లో ఉన్న 2.15 ఎకరాల కబ్జా కేసులో ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ డైరక్టర్ శ్రీనివాస్ మార్చి 3వ తేదీన ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కల్వకుంట్ల కన్నారావు సహా 38 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కన్నారావు(Kalvakuntla Kanna Rao) ప్రధాన అనుచరుడు డేనియల్ సహా 10 మందిని ఇప్పటిదాకా రిమాండ్‌కు తరలించారు.
Also Read : Janasena : జనసేనకు షాక్ ఇచ్చిన ఈసీ..
ఈ కేసులో జక్కిడి సురేందర్‌రెడ్డి, జక్కిడి హరినాథ్, కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు అలియాస్ కన్నారావు, శివ, డేనియెల్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీళ్లలో నలుగురిని ఇప్పటికే రిమాండ్ చేశారు. అయితే, తనపై ఆదిభట్ల పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కన్నారావు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. పోలీసులకు చిక్కకుండా కల్వకుంట్ల కన్నారావు సింగపూర్‌కు పరారైనట్టు ప్రచారం జరగడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు కన్నారావును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.