HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Super Speech At Tdp 43 Foundation Day

Nara Lokesh: టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మంత్రి లోకేష్ కీల‌క హామీ.. ప్ర‌మోష‌న్ ఇస్తా అంటూ వ్యాఖ్య‌లు!

పసుపు జెండా మనకు ఎమోషన్…43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

  • By Gopichand Published Date - 11:43 AM, Sat - 29 March 25
  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: పసుపు జెండా మనకు ఎమోషన్…43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని కేడర్ మనకు మాత్రమే సొంతమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన సభలో లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం, మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యం. మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడకొట్టాయి. ఆ మూడు అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయి. అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం… ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్‌.

కరుడుగట్టిన పసుపు సైన్యమే మన బలం

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసారు. ఆ ముహూర్తబలం గొప్పది.. పునాది గట్టిది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్. 43ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టిడిపి, జై చంద్రబాబు అంటూ ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరుడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము. 43ఏళ్లుగా పార్టీకి, పసుపు జెండాకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి నా పాదాభివందనం.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన ఎన్టీఆర్

సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న సిద్ధాంతంతో అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటివరకూ ఎన్నికష్టాలు ఎదురైనా అదే స్పూర్తితో పనిచేస్తున్నాం. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ – దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన పేదల పెన్నిధి చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ – తెలుగువారిని ప్రపంచపటంలో పెట్టింది చంద్రన్న. రూ.2 లకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తిహక్కు, వృద్ధాప్య పింఛను లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి పరిచయం చేసింది టిడిపి. చదువుకున్న యువతకు సీట్లు ఇచ్చింది టిడిపి. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది టిడిపి బిసిలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది టిడిపి. కుల వివక్ష లేకుండా చేసింది టిడిపి.

మనకు గల్లీ తెలుసు… ఢిల్లీ తెలుసు!

మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు – ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్దానికి వాడుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టిడిపి. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడం లో మన కృషి ఉంది. జిఎంసి బాలయోగి గారిని పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్ చేసింది మనమే. అంబేద్కర్‌ గారికి భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించాం. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడం లో కీలక పాత్ర పోషించాం. తెలుగు దేశం జెండా పీకేస్తాం అని ఎంతో మంది వచ్చారు. అలాంటి వారు అడ్రెస్స్ లేకుండా పోయారు.

అరాచకానికి ఎదురొడ్డాం.. ప్యాలెస్ లు బద్దలుగొట్టాం

2019 వరకూ మనం చూసిన రాజకీయం వేరు, 2019 నుండి 2024 వరకూ మనం చూసిన రాజకీయం వేరు. అయిదేళ్లు గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలనను మనం ఎదుర్కొన్నాం. మన దేవాలయం పై దాడి చేస్తే వెన్నుచూపకుండా ఎదురునిలబడ్డాం. మన అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడాం. క్లైమోర్ మైన్ల కే భయపడని బ్లడ్ మనది. కామిడీ పీసులకు భయపడతామా? నలుగురు ఎమ్మెల్యేలను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాం అన్నవారికి ప్రతిపక్ష హోదా లేకుండా ఇంటికి పంపాం. ప్యాలెస్ లు బద్దలు కొట్టాం. 2024 ఎన్నికల్లో మన స్ట్రయిక్ రేట్ 94 శాతం. 58 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ చేశాం. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65 శాతం ఓట్ షేర్ సాధించాం. ప్రజలు ప్రజా ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్ష మేరకే ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది.

పేదరికం లేని సమాజమే టిడిపి లక్ష్యం

పేదరికం లేని సమాజమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రూ.200 పెన్షను రెండు వేలు చేసింది మనమే. ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంది మనమే. దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికి పరిమితం అయిన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తుంది మనమే. దీపం పథకం కింద ఉచితంగా సుమారుగా కోటి సిలిండర్లు అందజేశాం. 16,347 పోస్టులతో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే మ్యానిఫెస్టోలో ఇచ్చిన 177 హామీల్లో పూర్తి స్థాయిలో అమలు చేసినవి 55, పాక్షికంగా అమలు చేసినవి 49 అంటే దాదాపు సగానికి పైగా హామీలు అమలయ్యాయి. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం.త్వరలోనే పి4 కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది.

కార్యకర్తలకు తగిన గుర్తింపునిస్తాం

తెలుగుదేశం పార్టీ లో కార్యకర్తే అధినేత. ఈ మాట నేను ఊరికే అనడం లేదు. దేశంలో కార్యకర్తలకు గౌరవం ఇచ్చే ఒకే ఒక్క పార్టీ టిడిపి. మంచి చేస్తే మెచ్చుకుంటారు. తప్పు చేస్తే తాట తీస్తారు. కోటి సభ్యత్వాలు అనేది ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డు. దాన్ని మనం సాధించాం. కేవలం 83 రోజుల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేశాం. ఏపీలో… 1 కోటి 53 వేల 551 సభ్యత్వాలు, తెలంగాణాలో… 1,78,041 సభ్యత్వాలు.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మొత్తం… 1 కోటి 2 లక్షల 35 వేల 857 సభ్యత్వాలు నమోదయ్యాయి. ప్రమాద బీమా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాం. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు రూ.140 కోట్లు ఖర్చు చేసింది టిడిపి. కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తాం. 2004లో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించి ఉద్యోగాలకు వచ్చేవరకు నిలబడింది చంద్రబాబు. పాదయాత్రలో ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలను కలిశా. ప్రస్తుతం వారు వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయికి చేరారు. దేశ చరిత్రలో ఏ పార్టీలో అది జరగలేదు. అలాంటి నాయకుడు అధ్యక్షుడిగా ఉండటం మన అదృష్టం.

పనిచేసే వారికి ప్రమోషన్ ఇస్తా

కార్యకర్తల కోసం నేను బయట ఎంత పోరాడతానో పార్టీలో కూడా అంతే పోరాడతాను. నా లక్ష్యం ఒక్కటే పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే. గ్రామ స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగాలి అనేది నా కోరిక. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. రెండు టర్మ్ లు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలి. ఇది జరిగితే పార్టీలో కదలిక వస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా 4వససారి పనిచేస్తున్నా. పార్టీలో ప్రక్షాళన నాతోనే మొదలు పెట్టండి. యువకులకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక వస్తుంది. నా స్టయిల్ ఒక్కటే… సీనియర్లను గౌరవిస్తా … పనిచేసే జూనియర్లకు ప్రమోషన్ ఇస్తా. పార్టీ మరో నలభై ఏళ్లు బ్రతకాలి అంటే కొత్త రక్తం ఎక్కించాలి. దానికి అందరి సహకారం కావాలి. పనిచేసిన వారికే పదవి అనేది నా విధానం. నాయకుల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగే వారికే పదవులు ఇస్తాం. పార్టీలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తాం. త్వరలోనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నాం.

Also Read: X Sold To xAI : ఎక్స్‌ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. డీల్ విలువ రూ.2.82 లక్షల కోట్లు

రెడ్ బుక్ పేరు చెబితే కొందరికి గుండెపోటు

ఇక ఎక్కడికి వెళ్లినా అందరూ రెడ్ బుక్, రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి గుండెపోటు వస్తుంది. కొంతమంది బాత్ రూం లో జారిపడి చేతులు విరగ్గొట్టుకుంటున్నారు. అర్దం అయ్యిందా రాజా. అధికారంలో ఉన్నాం అని గర్వం వద్దు, ఇగో వద్దు. అందరం కలిసి ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజల ఆశీస్సులు ఉంటేనే మనం ఉంటామన్న విషయాన్ని కార్యకర్తలు గుర్తు పెట్టుకోవాలి, ప్రజల మనసు గెలిచేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు నిరంతరం శ్రమించాలని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • nara lokesh
  • ntr bhavan
  • tdp formation day
  • TDP Foundation Day
  • telugu desam party

Related News

Lokesh supports National Education Policy

Mega DSC : ప్రతి ఏటా DSC ప్రకటన – లోకేష్

Mega DSC : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం (Kutami Govt) విద్య రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనలో ప్రతి ఏడాది DSC నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల నియామకాలు క్రమబద్ధంగా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కలిగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

  • Lokesh Og

    OG Movie : OG బ్లాక్ బస్టర్ హిట్ కావాలని లోకేష్ ట్వీట్

  • Lokesh Fire Assembly

    Vizag Steel Plant : వైసీపీ నేతలకు చెమటలు పట్టించిన నారా లోకేష్

  • Fees Of Private Schools

    Fees of Private Schools : ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ పై లోకేష్ క్లారిటీ

  • Minister Nara Lokesh

    Minister Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవతో నెరవేరిన చిన్నారి జెస్సీ కల!

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd