Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు
- Author : Sudheer
Date : 11-02-2024 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ..సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు.
ఈరోజు ఇచ్ఛాపురం నుండి యాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్బంగా టెక్కలి లో ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ఫై కీలక వ్యాఖ్యలుచేసారు. జగన్ మోహన్ రెడ్డీ… పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేస్తాం… కాసుకో’’ అంటూ హెచ్చరించారు. . ఆంధ్ర ప్రదేశ్ ను సర్వ నాశనం చేసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారని అన్నారు. జగన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బూటకపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై సీఎం జగన్ మాట తప్పారని పేర్కొన్నారు. జగన్ తన కుటుంబసభ్యులకే రక్షణ కల్పించట్లేదు చెల్లెళ్లు షర్మిల, సునీత తమకే భద్రత లేదంటున్నారు అలాంటి జగన్ సొంత చెల్లెలకే భద్రత ఇవ్వకపోతే సాధారణ మహిళల పరిస్థితేంటని లోకేశ్ ప్రశ్నించారు. దేశంలో వంద సంక్షేమ పథకాలు కోతపెట్టిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం వస్తే ప్రతి రైతుకు అండగా ఉండేందుకు రూ.20 వేలు అందిస్తామని ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని 18 నుంచి 59 ఏళ్ల మహిళకు ప్రతి నెల రూ.1500 అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ ఇచ్ఛాపురానికి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు కానీ టీడీపీ- జనసేన వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అన్నారు. అలానే కొబ్బరి, జీడిపప్పు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ప్రతి రైతుకు అండగా ఉంటామని అన్నారు. జగన్ పేదవాడు అని చెప్పుకుంటున్నాడని.. రూ.లక్ష విలువ చేసే చెప్పులు వేసుకునే వ్యక్తి పేద వాడు అవుతాడా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ అని చురకలు అంటించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న సీఎం జగన్.. రాష్ట్రంలో ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్న తెరిపించారా? అని ప్రశ్నించారు. ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని ప్రశ్నించారు.
చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్ (Red Book) లో ఉన్నాయని వారిపై న్యాయ విచారణ జరిపిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. టిడిపి పార్టీ వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. టీడీపీ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి గడపకు చేర్చాలని నేతలకు లోకేశ్ సూచించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సభలో లోకేశ్, ఎంపీ రామ్మోహన్, కళా వెంకట్రావు నాయకులు, కార్యకర్తలు, జనసేన నేతలు పాల్గొన్నారు.
Read Also : Free Current Guidelines : మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే ..ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ..!!