అమరావతి ఆశాకిరణం.. యువత భవిష్యత్ వారధి లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు
- Author : Sudheer
Date : 23-01-2026 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ యువనేతగా, సమర్థవంతమైన మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న లోకేష్‌కు రాజకీయ మరియు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నారా లోకేష్ రాజకీయ జీవితంలో ‘యువగళం’ పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు వేల కిలోమీటర్ల మేర ఆయన సాగించిన ఈ సుదీర్ఘ యాత్ర, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ, వారి గొంతుకగా మారి లోకేష్ సాగించిన ఈ పోరాటం గత ఎన్నికల్లో కూటమి విజయానికి బలమైన పునాది వేసింది. ఈ పాదయాత్ర ద్వారా ఆయన ఒక సాధారణ నాయకుడి నుండి మాస్ లీడర్‌గా ఎదిగి, ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

Nara Lokesh Raises New Doub
ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా గ్లోబల్ కంపెనీలను ఏపీ వైపు ఆకర్షించడంలో ఆయన సఫలీకృతులవుతున్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే నినాదంతో పారిశ్రామికవేత్తలకు భరోసా ఇస్తూ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారు. విద్యాశాఖలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, పాఠశాలల మౌలిక సదుపాయాలు మరియు నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు.
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల నేతలు ఆయనకు విషెస్ తెలియజేశారు. అటు సినీ రంగం నుండి కూడా చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర నటులు లోకేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులు మరియు అభిమానులు భారీ ఎత్తున పోస్టులు చేస్తూ, సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నారా బ్రాహ్మణి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సందర్బంగా లోకేష్ తన బలమని, ప్రశాంతత అని బ్రాహ్మణి పేర్కొన్నారు. లోకేష్ పక్కన నడవడానికి ఎప్పుడూ గర్వపడతానని తెలిపారు. “నా బలం, నా ప్రశాంతత అయిన లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు పడుతున్న కష్టం, చేస్తున్న త్యాగాలు మరియు మీరు మోస్తున్న బాధ్యతలను నేను నిత్యం గమనిస్తూనే ఉన్నాను… ఇవన్నీ మీరు ఎంతో నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ ఏడాది మీకు ఎంతటి పని ఒత్తిడిలోనైనా ప్రశాంతమైన క్షణాలు లభించాలని కోరుకుంటున్నాను. మీ వెంటే నడుస్తున్నందుకు నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను’’ అని బ్రాహ్మణి పేర్కొన్నారు.
‘‘ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో లోకేష్ ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.