Amaravati Ring Road Case : ఈరోజు అర్ధరాత్రి లోకేష్ ను అదుపులోకి తీసుకోబోతున్నారా..?
నారా లోకేష్ ను ఈరోజు అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా లోను ఇదే చర్చ నడుస్తుంది.
- By Sudheer Published Date - 10:55 PM, Tue - 26 September 23

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ( Amaravati Ring Road Case)లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh Arrest) ను ఈరోజు అర్ధరాత్రి తర్వాత అదుపులోకి తీసుకోబోతున్నారా..? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియా లోను ఇదే చర్చ నడుస్తుంది. 18 రోజుల క్రితం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు (Chandrababu) ను ఎలా అరెస్ట్ చేసారో తెలియంది కాదు..నంద్యాల పర్యటన లో ఉన్న చంద్రబాబు వద్దకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో వెళ్లి..నానా హడావిడి మధ్య అదుపులోకి తీసుకున్నారు. తన తప్పు ఏమిలేదని..అసలు FIR లో తన పేరే లేదని ..ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశించినప్పటికీ.. సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏంజరిగిందో..గత 18 రోజులుగా ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం.
ఇక ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ చుట్టు ఉచ్చు బిగిస్తున్నారు సీఐడీ అధికారులు. ఈ కేసులో లోకేష్ ను A14 గా చేరుస్తూ హైకోర్టు లో ఏపీ సీఐడీ మంగళవారం మెమో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో లోకేష్ ను ఈరోజు అర్ధరాత్రి అదుపులోకి తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్ ను అరెస్ట్ చేస్తే ఏంచేయాలి..అనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ లో ఉన్నారు. చంద్రబాబు కేసుల విషయమై న్యాయవాదులో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ యాత్రను వచ్చే వారంలో తిరిగి ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలతో ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభానికి ముందే లోకేష్ అరెస్ట్ చేస్తారని కొంతమంది అంటుంటే..ఈరోజే అరెస్ట్ చేయొచ్చని మరికొంతమంది అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Kanaka Durga Temple Income : విజయవాడ కనకదుర్గమ్మ ఆదాయం ఎంతొచ్చిందో తెలుసా? గత 22 రోజులకు..