Ayyanna Patrudu : హరికృష్ణకు టీ మోసిన కోడలి నాని.. ఇప్పుడు నందమూరి కుటుంబం నాశనం కోరుకుంటున్నాడు..
తాజాగా కొడాలి నాని(Kodali Nani) చంద్రబాబు అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడుతూ భువనేశ్వరిపై, చంద్రబాబుపై సెటైర్లు వేశాడు. దీంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కొడాలి నానిపై ఫైర్ అయ్యారు.
- Author : News Desk
Date : 26-09-2023 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత ఏపీ రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా టీడీపీ(TDP)తో కలవడంతో వైసీపీ నాయకులు వరుసగా టీడీపీ జనసేన(Janasena) పార్టీలపై ఫైర్ అవుతున్నారు. అటు చంద్రబాబు అరెస్ట్ నిరసనగా ఎక్కడికక్కడా నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. చంద్రబాబు అరెస్టుతో ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి కూడా రాజకీయ రంగంలోకి దిగారు. దీంతో వైసీపీ నాయకులు వారిని కూడా విమర్శించడం మొదలుపెట్టారు.
తాజాగా కొడాలి నాని(Kodali Nani) చంద్రబాబు అరెస్ట్ అంశంపై మీడియాతో మాట్లాడుతూ భువనేశ్వరిపై, చంద్రబాబుపై సెటైర్లు వేశాడు. దీంతో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కొడాలి నానిపై ఫైర్ అయ్యారు.
అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కొడాలి నానికి సంస్కారం లేదు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కొడాలి నాని లాంటి సన్నాసులకు కనపడదు. పిచ్చి వాగుడు వాగుతూ శునకానందం పొందుతున్నారు. ఒకప్పుడు హరికృష్ణకు టీ మోసిన కొడాలి నాని ఇవాళ నందమూరి కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నారు. కొడాలి నానికి ఓటేసి గెలిపించినందుకు గుడివాడ ప్రజలు సిగ్గుపడుతున్నారు. గుట్కా నాని.. రోజా.. అంబటి, గుడివాడ అమర్నాధ్ లాంటి వాళ్లని మేం ఊపేక్షించం అంటూ ఫైర్ అయ్యారు.
ఇక లోకేష్ పై పెట్టిన కేసుల గురించి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తానంటే భయపడి రాజమండ్రి బ్రిడ్జిని రిపేర్ల పేరుతో మూసేశారు. అసలు రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసు..? లోకేష్ పై అలాంటి కేసులు పెడుతున్నారు అని అన్నారు.
Also Read : Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం