Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ – నారా లోకేష్ సంచలనం
విద్యార్థులకు పఠన సంస్కృతిని అలవాటు చేసేందుకు కొత్త పుస్తకాల కొనుగోలు, కమ్యూనిటీ రీడింగ్ కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
- By Dinesh Akula Published Date - 12:19 PM, Tue - 23 September 25

అమరావతి, ఆంధ్రప్రదేశ్: (Nara Lokesh in Assembly)- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుస్తకాల పఠనాన్ని ప్రోత్సహించే దిశగా ముఖ్యమైన ప్రకటన చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అసెంబ్లీలో లైబ్రరీ వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రశ్నలకు సమాధానంగా అమరావతిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన స్టేట్ లైబ్రరీను నిర్మించనున్నట్లు వెల్లడించారు. రూ.150 కోట్ల వ్యయంతో ఈ లైబ్రరీ నిర్మాణం 24 నెలల్లో పూర్తవుతుందని లోకేష్ తెలిపారు.
ఇప్పటికే మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న మోడల్ లైబ్రరీ చివరి దశకు చేరుకుందని, ఇది అక్టోబర్‌లో ప్రారంభించబడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి ఆధునిక లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు.
విద్యార్థులకు పఠన సంస్కృతిని అలవాటు చేసేందుకు కొత్త పుస్తకాల కొనుగోలు, కమ్యూనిటీ రీడింగ్ కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు కూడా ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని లోకేష్. అన్నారు.
పుస్తక పఠనం వ్యక్తిత్వాన్ని మార్చుతుందని చెబుతూ, తన కుమారుడు దేవాన్ష్ పుస్తక పఠన అలవాటుతో ఎలా మారిపోయాడో కూడా సభలో ఉదాహరణగా పంచుకున్నారు.పుస్తక పఠనంతో పిల్లల ఆలోచనా శక్తి, బలపడుతుందని నారా లోకేష్ తెలిపారు.
ఈ ప్రాజెక్టులు అమలయ్యాక రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులలో చదువుపట్ల ఆసక్తి పెరగడం ఖాయమని అభిప్రాయపడ్డారు.
I answered questions in the House on strengthening our library ecosystem across Andhra Pradesh. Announced a world-class State Library in Amaravati (₹150 crore), to be completed in 24 months. The Mangalagiri Model Library, now in its final stage, will be inaugurated in October.… pic.twitter.com/3H28HgqkG7
— Lokesh Nara (@naralokesh) September 23, 2025